Mr.Bachchan: మిస్టర్ బచ్చన్ అన్ని కలిసొస్తున్నాయి, పెయిడ్ ప్రీమియర్స్ కి క్రేజీ రెస్పాన్స్

Mr.Bachchan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ షో కి లభించే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో ఒక పక్కా కమర్షియల్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఇక ప్రస్తుతం ఆగస్టు 15 సందర్భంగా రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. వాటిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ (Ravi Teja ) హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.

ఇకపోతే హరీష్ శంకర్ (Harish Shankar) రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. మొదటి సినిమా షాక్ ఇచ్చిన రెండవ సినిమా మిరపకాయ్ సక్సెస్ ఘాటు మాత్రం చాలామందికి గుర్తుండిపోయింది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇప్పటివరకు నాలుగు పాటలను రిలీజ్ చేశారు. ఈ పాటలన్నీ కూడా సినిమా పైన విపరీతమైన అంచనాలను పెంచుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా 15 రిలీజ్ అవుతున్న సందర్భంగా 14వ తారీకు రాత్రి నుంచి ప్రీమియర్ షోస్ వేయడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పటివరకు 15000 టికెట్లు బుక్అయ్యాయి. అంతేకాకుండా చాలాసార్లు హౌస్ ఫుల్ అయ్యాయి.

Raviteja

- Advertisement -

ఈ సినిమా మొదటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హీట్ రైడ్ (Ride) సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఒక రీమేక్ ను హరీష్ శంకర్ ఎంత నీట్ గా హ్యాండిల్ చేస్తాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీటన్నిటి మించి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మిక్కి జె మేయర్ (Mickey J Mayer) నుంచి ఇటువంటి సాంగ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోవడం ఉండరు. అన్ని పాటలు ఒక ఎత్తు అయితే రీసెంట్ గా వచ్చిన నల్లంచు తెల్లచీర సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను భాస్కర భట్ల రవికుమార్ రాశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు