Mr Bacchan Trailer : మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “మిస్టర్ బచ్చన్” సినిమా ఆగష్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పదమూడేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో రవన్న అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షాక్, మిరపకాయ్ తర్వాత వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు నెలకొని ఉండగా, దానికి తగ్గట్టు గానే టీజర్, సాంగ్స్ ప్రోమోలతో సినిమాపై అంచనాలు పెంచేస్తూ వచ్చారు. మాస్ మహారాజ్ సహా, హరీష్ శంకర్ ఇప్పటికే తన మార్క్ ప్రమోషన్లతో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఇక మిస్టర్ బచ్చన్ నుండి ఫైనల్ బ్లాస్ట్ గా థియేట్రికల్ ట్రైలర్ కాసేపటికిందే యూట్యూబ్ లో విడుదలై ట్రెండ్ అవుతుంది.
ఎలివేషన్లతో కిక్కెక్కించిన మాస్ మహారాజ్…
ఇక రవితేజ హరీష్ శంకర్ కాంబో సినిమా అంటే అభిమానులకు ఎంతటి అంచనాలు ఉంటాయో అలాంటి అంచనాలే పుట్టిస్తుంది ట్రైలర్. ట్రైలర్ లోనే మాస్ మహారాజ్ రవితేజ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించాడు. హరీష్ శంకర్ తమ మార్క్ ఎలివేషన్లతో ఫ్యాన్స్ కి మరింత గూస్బంప్స్ తెప్పించాడు. ఇక రవితేజ ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ గా ఒక ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా నటించాడు. ఈ క్రమంలో జగపతిబాబుపై రైడ్ చేయమని ఆర్డర్ వస్తుంది. ఈ క్రమంలో అతనితో వైరం మిస్టర్ బచ్చన్ వైరం పెట్టుకుంటాడు. ఈ పరిస్థితులు ఎంత వరకు దారితీసాయి.. మధ్యలో హీరోయిన్ తో ట్రాక్ ఏంటి అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఇక ట్రైలర్ ని చూస్తుంటే కథ నేపథ్యం సింపుల్ గా తెలిసిపోతున్నా, హరీష్ శంకర్ తన మార్క్ ఎలివేషన్లతో రవితేజని ఊర మాస్ గా చూపించాడని చెప్పాలి. ఇక దానికి తగ్గట్టు మిక్కీజి మేయర్ ఇచ్చిన బీజీఎమ్ కూడా బాగుంది. ఇక భాగ్యశ్రీ పాత్ర కథతో ఎక్కువగా సంబంధం లేకపోయినా తన గ్లామర్ షో కి స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుందని అనిపిస్తుంది. హిందీ సినిమా రైడ్ రీమేక్ అయినా ఎక్కడా రీమేక్ అనే భావన రాకుండా హరీష్ జాగ్రత్త పడుతున్నాడని అనిపిస్తుంది.
భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ!
ఇక రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వా ప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించగా, సచిన్ ఖడేకర్, శుభలేఖ సుధాకర్, కమెడియన్ సత్య, ప్రవీణ్, సత్యం రాజేష్, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక విడుదలైన ట్రైలర్ తో మాస్ మహారాజ్ పంద్రాగస్టున భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని అనిపిస్తుంది. వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు రవన్న ఫ్యాన్స్.