Movie sensor: సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలు ఇవే.. మీ ఫేవరెట్ మూవీ కూడా ఉందండోయ్..!

Movie sensor.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని సౌత్ ఇండియా తో పాటు నార్త్ ఇండియా చిత్రాలు కూడా సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. మరి ఈ సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాల జాబితాలో మీ సినిమా కూడా ఉందేమో చూసేద్దాం.

Movie sensor: These are the movies that have been censored.. You have your favorite movie too..!
Movie sensor: These are the movies that have been censored.. You have your favorite movie too..!

మత్తు వదలరా 2..

శ్రీ సింహ కోడూరు, సత్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మత్తు వదలరా 2. రితేష్ రానా దర్శకత్వంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి 139.50 నిమిషాలు రన్ టైం లాక్ చేశారు. క్రైమ్ స్టోరీ తరహాలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతోంది.

- Advertisement -

భలే ఉన్నాడే:

డైరెక్టర్ మారుతి సమర్పణలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన చిత్రం భలే ఉన్నాడే. జె శివ సాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఈ సినిమాని రవి కిరణ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్.వీ. కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ అభిరామి కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా..112.47 నిమిషాల రన్ టైం లాక్ చేయడం జరిగింది.

కళింగ..

కిరోసిన్ సినిమాతో ఆకట్టుకున్న ధ్రువ వాయు కళింగ సినిమాతో దర్శకుడిగా హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా కూడా సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ కాబోతుండగా 115.50 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారు. ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి , పృథ్వీ యాదవ్ నిర్మించారు.

లైఫ్ స్టోరీస్..

అక్జన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వస్తున్న చిత్రం ఇది సెప్టెంబర్ 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా, తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రానికి 103.03 నిమిషాల నిడివిని లాక్ చేశారు. ఈ చిత్రంలో సత్య కేతినీడి, శాలిని కొండేపూడి, దేవయాని శర్మ, లక్ష్మీ సుంకర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఉత్సవం:
రెజీనా, దిలీప్ ప్రకాష్ కీలక పాత్రల్లో అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన చిత్రం ఉత్సవం. సెప్టెంబర్ 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 140.35 నిమిషాల నిడివిని లాక్ చేశారు.

A.R.M.3D(మలయాళం , తెలుగు)..

టోవినో థామస్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగు అలాగే మలయాళం భాషల్లో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి 148.24 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారు.

స్పీక్ నో ఎవిల్ (ఇంగ్లీష్ మూవీ)..

అమెరికన్ సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ గా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల కాబోతోంది. యునైటెడ్ స్టేట్స్ లో యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ చిత్రం 110.03 నిమిషాల రన్ టైం లాక్ చేయబడింది.

తుంబాడ్ (హిందీ)..
రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో రీ రిలీజ్ కి సిద్ధమైంది. ఇక ఈ సినిమా కూడా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోగా.. 113.06 నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు