Motta Rajendran.. మొట్ట రాజేంద్రన్.. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఈయన పేరు చెబితే గుర్తుపట్టరు కానీ గుండు బాస్ అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ముఖ్యంగా చాలా సినిమాలలో కమెడియన్ గా, విలన్ గా నటించి మెప్పించిన ఈయనను చూసినా చాలు టక్కున నవ్వేస్తారు. ముఖ్యంగా హీరో సూర్య నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
కోట్ల రూపాయలకు ఆస్తిపరుడు..
ఆ తర్వాత రాజారాణి సినిమాలో హీరో పనిచేసే ఆఫీసులో బాస్ గా నటించిన ఈయన, వీటితోపాటు శివ కార్తికేయన్ హీరోగా నటించిన రెమో చిత్రంలో కూడా నటించారు. కమెడియన్ గా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న రాజేంద్రన్ పైకి సింపుల్గా కనిపిస్తునా ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. రూ.కోట్లకు ఆస్తిపరుడు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు మొట్ట రాజేంద్రన్. బక్కగా గుండుతో నల్లటి ఆకారంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన కెరియర్ మొదట్లో స్టంట్ గా, డూప్ గా నటించేవారట.
500 కు పైగా చిత్రాలలో స్టంట్ గా..
దాదాపు 500 కు పైగా చిత్రాలలో స్టంట్ గా పని చేసిన ఈయన తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా ఫైటర్గా కనిపించారు. అంతేకాదు పితామగన్ సినిమాతో నటుడిగా పరిచయమైన ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు అయితే ఒక షూటింగ్లో ప్రమాదానికి కూడా గురయ్యాడు.
జుట్టు శాశ్వతంగా పోవడానికి కారణం అదే..
అయితే ఈయన జుట్టు మొత్తం పోవడానికి ఒక కారణం ఉందట. చెన్నైలోని కళాపేట లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా.. అందులో ఒక సన్నివేశంలో ఒక నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడేయాలి. అయితే ఆ చెరువులో రసాయనాలు కలిసి ఉన్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువు లో పడిపోయాడు. అక్కడ రసాయనాలు ఎక్కువగా ఉండటంతో రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది. భవిష్యత్తులో జుట్టే లేకుండా పోయింది. అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి. అంతేకాదు ఆయన రంగు కూడా మారిపోయింది. ముఖం కూడా వింతగా తయారైంది. పైగా రసాయనాలు కలిపిన చెరువు నీళ్ళు కడుపులోకి వెళ్లడంతో అనేక అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడాయి జీర్ణాశయ సమస్యలతో ఇబ్బందులు పడ్డాడు.
సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్..
సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన తిరిగి నటించడం మొదలుపెట్టాడు. మొదట్లో అవకాశాలు రాకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ తర్వాత ఆయన ఆకారమే ఆయనను స్టార్ సెలబ్రిటీని చేసేసింది. కమెడియన్ గా , నటుడిగా 160కు పైగా చిత్రాలలో నటించిన ఈయన ప్రస్తుతం చెన్నైలో 15 కోట్ల రూపాయల ఇల్లు తో పాటు మూడు ఖరీదైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక చిన్న ప్రమాదం ఆయన జీవితాన్నే మార్చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే వరుస సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మొట్ట రాజేంద్రప్రసాద్.