Mollywood.. ఏ సినీ పరిశ్రమలోనైనా సరే మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల పైన అప్పుడప్పుడు ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ గత కొన్ని నెలలుగా మలయాళ సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న లైంగిక వేదింపుల పైన ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని జస్టిస్ హేమా తమ కమిటీ ద్వారా ఒక నివేదికను సైతం ముఖ్యమంత్రి వినరరాయ్ విజయన్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఒక నటి భావన పై స్టార్ నటుడు దిలీప్ , అతని అనుచరులు భావన పై అత్యాచారం చేయడానికి 2017లో ప్రయత్నించారంటూ ఒక కేసు ఫైల్ కాగా .. అప్పుడు ఈ కమిటీని సైతం ఏర్పాటు చేశారట.
మాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ..
ఈ కమిటీలో రిటైర్డ్ జస్టిస్ హేమాతో పాటుగా ,ప్రముఖ సీనియర్ నటి శారద, కేబి వలసల కుమారి తదితరులు సైతం ఉన్నారట. ఈ కమిటీ నివేదికను 2019లో ప్రభుత్వానికి సైతం అందించారు. అయితే అందులో కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నందు వలన వాటి గురించి పలు విషయాలు బయటకు చెప్పలేదట. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీలో నివేదిక ప్రకారం పలు భయంకరమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
కమిట్మెంట్ ఇవ్వకపోతే ఆడవారికి అవకాశాలు రావు..
మలయాళ సినీ పరిశ్రమలో జరిగేటువంటి చీకటి కోణాన్ని సైతం జస్టిస్ హేమా తమ రిపోర్టులో తెలిపిన ప్రకారం చాలా మంది నటీమణులు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లుగా తెలియజేసింది.. ముఖ్యంగా నటీమణులు అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు.. వారు ఉంటున్న గదుల తలుపులను మగవాళ్లు కొడుతూ ఎన్నోసార్లు వారిని ఇబ్బంది కలిగించే వారట. అయితే వారు అప్పటికే తాగి ఉండి చాలా అసభ్యకరంగా కూడా ప్రవర్తించే వారని ఈ కమిటీ ద్వారా తెలియజేసింది. అందుకే చాలామంది సెలబ్రిటీలు బయట షూటింగ్ లు ఉన్నప్పుడు కుటుంబాన్ని కూడా వెంట తీసుకు వెళ్తున్నామంటూ తెలియజేశారట. మలయాళ సినీ ఇండస్ట్రీ మొత్తం కొంతమంది పురుషుల కనుసైగ లలో నడుస్తోందంటూ తెలుపుతోంది.
బెదిరింపులకు పాల్పడుతున్న స్టార్ యాక్టర్స్..
కొంతమంది స్టార్ యాక్టర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు సైతం మలయాళ ఇండస్ట్రీని నడిపిస్తున్నారు అంటూ ఇది ఒక రకమైనటువంటి వ్యవస్థ అన్నట్లుగా కూడా తెలియజేసింది. అలాంటి వారితో మంచిగా ఉంటేనే రెమ్యూనరేషన్ , కొత్త సినిమాల అవకాశాలు వస్తాయంటూ జస్టిస్ హేమా రిపోర్టులో తెలియజేసింది. మరి కొంతమంది మగవాళ్ళు అయితే అడ్వాన్సులు ఇచ్చేసి కమిట్మెంట్లు కూడా అడుగుతున్నారని , వినకపోతే అవకాశాలు రావ్ అంటూ చాలామంది బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఈ నివేదికలో తేల్చి చెప్పింది జస్టిస్ హేమ. అయితే ఇలాంటివి భారతీయ సినీ పరిశ్రమలో జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఇలాంటి కమిటీలు వేయాలనే విషయాన్ని జస్టిస్ హేమా తెలియజేస్తోంది. మొత్తానికైతే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందన్న విషయాన్ని జస్టిస్ హేమా వెల్లడించింది. అయితే ఇక్కడ ఒక్క మాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు అన్ని భాష ఇండస్ట్రీలలో కూడా ఉంది. ఇలాంటి వాటిని వెలికి తీయాలంటే ఇలాంటి కమిటీలు తప్పవని , ఇకపై ఇండస్ట్రీలలో ఆడవారికి రక్షణ కల్పించాలని ఆమె తెలిపింది.