Mokshagna : నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరోల ఎంట్రీ మొదలైంది. ఒక్కొక్కరు కొత్త సినిమాలను ప్రకటిస్తున్నారు. అందరి చూపు ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కొడుకు మోక్షజ్ఞ తేజ (Mokshgna Teja) మీదే ఉంది.. ఇతన్ని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద అతడిని చూస్తామా అని బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా అతని రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.
మోక్షజ్ఞ డిమాండ్ మాములుగా లేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఏ కొత్త హీరో అంత రెమ్యునరేషన్ తీసుకోలేదట… నందిమూరి అభిమానులు. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి బాలయ్య తీసుకున్న ఇంట్రెస్ట్‌తో సినిమా డెఫినిట్‌గా సక్సెస్ అవుతుందనే అంచనాతో భారీగా రెమ్యునరేషన్ చెల్లించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారంటున్నారు.. అతను అడిగినంత సమర్పించారట. స్టార్ హీరో కన్నా ఎక్కువే అని ఇండస్ట్రీలో టాక్.. అతనికి మొదటి సినిమాకే రూ. 20 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్.
సాదారణంగా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చినా ఒకటి లేదా రెండు కోట్లు ఇచ్చేవారు. కొందరైతే మొదటి సినిమాకు ఎలాంటి పారితోషికం ఆశించేవారు కాదంటున్నారు. సినిమా సక్సెస్ అయ్యాకే లాభాల్లో ఎంతో కొంత మొత్తం తమ ఫస్ట్ రెమ్యునరేషన్‌గా తీసుకునేవారట. కానీ ఈ కుర్ర హీరోకు ఇంత అంటే మామూలు విషయం కాదు. మరి అంతకు మించి సినిమా ఉంటే ఆ రెమ్యూనరేషన్ కంటిన్యూ అవుతుంది. లేదంటే సెకండ్ సినిమాకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మోక్షజ్ఞ రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
ఇకపోతే ప్రశాంత్ వర్మ (Prasanth Varma ) డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri ) నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించనున్న సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని (Tejaswini ) సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ కూడా నటిస్తుందని టాక్.. ఈమెకు కుర్రాళ్ళ క్రేజ్ ఎక్కువ. అందుకే ఈమెను ఒకే చేసినట్లు టాక్.. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోందని చెబుతున్నారు.. ఈ సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య కొడుకుగా రాబోతున్నాడు. అందుకే ఇండస్ట్రీలో డిమాండ్ కూడా పెరిగింది. ఒక్క సినిమా హిట్ అయితే ఇక పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెట్టనున్నాడని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ ఎలాంటి కథతో మోక్షజ్ఞను లాంచ్ చేస్తాడో చూడాలి. సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని నందమూరి ఫ్యాన్స్ ఆరాట పడుతున్నారు.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..