Mokshagna : ఎంత పని చేశావయ్యా బాలయ్య… నువ్వు చేసిన మిస్టేక్ వల్లే మోక్షజ్ఞ ఎంట్రీ కష్టాలు..!

Mokshagna.. నటసింహ నందమూరి బాలకృష్ణ తన వారసుడిని ఇండస్ట్రీ కి పరిచయం చేయడానికి నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే..నిజానికి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోనే కాదు అంతకుమించి పలుకుబడి ఉన్న హీరో కూడా.. ఆయనకు తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం అంత కష్టమైన పనేమీ కాదు.. కానీ ఎందుకో మోక్షజ్ఞ ఎంట్రీ కి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. మరొకవైపు బాలకృష్ణ తాను కమిట్ అయిన సినిమాలలో బిజీగా ఉండడం.. ఇంకొకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి బాధితులు రెట్టింపడంతో కొడుకు ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ఆయనకు సరైన సమయం కుదరడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Mokshagna : How much work you have done Balayya... Mokshagna entry difficulties are due to your mistake..!
Mokshagna : How much work you have done Balayya… Mokshagna entry difficulties are due to your mistake..!

బాలయ్య తప్పే మోక్షజ్ఞ ఎంట్రీ కష్టం..

మరొకవైపు నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుండడంతో.. మోక్షజ్ఞ కి కూడా సినిమాల్లోకి రావాలని బాగా ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ అన్న.. దివంగత నటుడు జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ కూడా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీంతో బాలయ్యలో కూడా కాస్త చురుకుదనం వచ్చిందని మోక్షజ్ఞను త్వరగా సినిమాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది.. అయితే ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా .. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎందుకు ఆలస్యం అవుతోంది అంటే అందుకు బాలయ్య చేసిన ఒక తప్పే కారణం అని.. ఇప్పుడు ప్రధానంగా తెరపై వినిపిస్తోంది..

సీనియర్ ఎన్టీఆర్ లా బాలయ్య చేయలేకపోతున్నారా..

ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ చాలా పద్ధతిగా గతంలో బాలకృష్ణను సినిమాలోకి తీసుకొచ్చారు.. బాలయ్య కెరియర్ ప్రారంభంలో తన దర్శకత్వంలో కొన్ని సినిమాలలో నటింపచేశారు.. అంతేకాదు తనతో పాటు కలసి కొన్ని సినిమాలలో నటించేలా చేసుకొని.. నటనలో జాగ్రత్తలు, మెలుకువలు నేర్పించారు.. పైగా కే విశ్వనాథ్, బాపు లాంటి మంచి దర్శకులతో కూడా బాలకృష్ణకు సినిమాలు సెట్ చేశారు. చాలా సీనియర్ దర్శకుల వద్ద శిక్షణ పొందేలా చేశారు..అందుకే బాలయ్య ఎంట్రీ కి పెద్దగా కష్టం అనిపించలేదు..

- Advertisement -

మోక్షజ్ఞకి మోక్షం కలిగేది బాలయ్య చేతుల్లోనే..

కానీ బాలయ్య కొడుకు విషయంలో ఇవేవీ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ఎంత పని చేశావయ్యా.. నువ్వు చేసిన ఆ మిస్టేక్ వల్ల మోక్షజ్ఞ ఎంట్రీ కి మోక్షం కలగలేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా.. బాలయ్య మోక్షజ్ఞ కెరియర్ కోసం తన తండ్రి లాగే పక్కా ప్లాన్ చేస్తే రాబోయే ఆరు నెలల్లో కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. మరి ఇప్పటికైనా బాలయ్య తన తండ్రి లాగా ఆలోచించి కొడుకు కోసం ఏ మేరకు రంగంలోకి దిగుతారో చూడాలి. ఒకవేళ బాలకృష్ణ కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కచ్చితంగా మోక్షజ్ఞ సక్సెస్ కు ఏమంత కష్టం కాదు అనడంలో సందేహం లేదు. ఇక మరొకవైపు బాలకృష్ణ కూతురు ఇద్దరు తమ కెరియర్ లో సెటిల్ అయిపోయారు వీరి అల్లుళ్లు కూడా ఉన్నత స్థాయిలోనే మరి కూతుర్లను సెటిల్ చేసిన బాలయ్య కొడుకుని ఏ మేరకు సినిమా రంగంలో సెటిల్ చేస్తారో చూడాలి. మొత్తానికి అయితే బాలయ్య తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోక్షజ్ఞ త్వరలోనే తెరపై కనిపించబోతున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు