Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నలుగురు దిగ్గజ నటులు నాలుగు స్తంభాలుగా ఉన్నారు. అందులో నాగార్జున, వెంకటేష్, బాలయ్య, చిరంజీవి వంటి నాలుగు పెద్ద కుటుంబాలు ఉన్నాయి. అయితే వాళ్లు మాత్రమే కాదు ఇండస్ట్రీలో మాది కూడా పెద్ద కుటుంబం అని చెప్పుకునే ఫ్యామిలీ మంచు (Manchu Mohan Babu) ఫ్యామిలీ. ఆ పెద్ద ఫ్యామిలీ ఇండస్ట్రీలో పెత్తనం గురించి జరిగే గొడవల్లో ముందుంటారు. కానీ జనాలకు ఏదైనా ఆపద వస్తే మాత్రం కనీసం కన్నెత్తి చూడరు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వరదల వల్ల విలవిల్లాడుతుంటే, ఈ మంచు ఫ్యామిలీ మాత్రం చాలా కూల్ గా తమకు సంబంధించిన పనుల్లో మునిగిపోయారు.
చెప్పుకోవడానికి పెద్ద ఫ్యామిలీ…
మంచు ఫ్యామిలీ(Manchu Mohan Babu)… ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వచ్చినా, లేదంటే ఏ స్టేజ్ పై మాట్లాడినా సరే మోహన్ బాబు (Manchu Mohan Babu) నోరు విప్పితే చాలు మెగా కుటుంబం, నందమూరి కుటుంబం కంటే తామే పెద్ద నటులమని, తమను మించిన నటులు తెలుగు ఇండస్ట్రీలోనే లేరని చెప్పుకుంటారు. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా ఓ వెలుగు వెలిగిన ఈ హీరో ఇప్పుడు మాత్రం కేవలం గొప్పలు చెప్పుకోవడంలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తాము హీరోలమని చెప్పుకోవడమే కాకుండా మోడీతో తమ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటారు. అయితే నిజంగానే మోహన్ బాబు (Manchu Mohan Babu) చెప్పుకునే ఇంత పెద్ద, గొప్ప కుటుంబమైన మంచు ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తోంది? వాళ్లు అంత పెద్ద నటులుగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన ప్రజలకు కష్టాలు వస్తే ఈ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళింది? అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.
మోహన్ బాబు కంటికి కనిపించడం లేదా?
ఓవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రాలో కుండపోత వర్షాల కారణంగా వచ్చిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఎంతో మంది ప్రజలు ఆకలితో అలమటించిపోయారు. ఉండడానికి గూడు, తినడానికి తిండి లేక అల్లాడిపోయిన ఆ ప్రజలను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలయ్య, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు నడుం బిగించారు. అంతేకాకుండా చిన్నా చితకా సెలబ్రిటీలు కూడా ఉడతా భక్తిగా తమ వంతు సాయం చేశారు. కొందరు కోట్లలో విరాళం ఇస్తే, మరికొందరు తమకు తోచినంత, ఇంకొందరు లక్షల్లో విరాళం ఇచ్చి తమ మంచి మనసును చాటుకున్నారు. కానీ సినిమా చరిత్రలోనే తిరుగులేని నటులుగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ (Manchu Family ) మాత్రం కనీసం రెస్పాండ్ అవ్వలేదు. మోహన్ బాబు(Manchu Mohan Babu)తో పాటు ఆయన ఇద్దరు వారసులు కూడా కనీసం రెస్పాండ్ కాలేదు. మరి మోహన్ బాబు తాము లెజెండరీ నటులము అని ఏ రకంగా చెప్పుకుంటారో ఆయనకే తెలియాలి. ఇలా ఊరికే పెద్ద నటులం అని చెప్పుకోవడం కాదు ప్రజలకు అవసరం అయినప్పుడు చేతనైనంత సాయం చేసే నటులే రియల్ లెజెండరీ నటులు. అంతేగానీ మాటల్లో తప్ప చేతల్లో చూపించలేని నటులు ఇండస్ట్రిలో ఇలాగే ట్రోలింగ్ పరిమితం అవుతారు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు నెటిజన్లు.