Mehreen.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటిసారిగా హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మెహ్రీన్.. అయితే ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే అందంతో, అమాయకత్వంతో అందరిని ఆకట్టుకుంది. ఆ వెంటనే టాలీవుడ్ టైర్-2 హీరోలతో నటించే అవకాశాలు వెలువడ్డాయి.. మెహ్రిన్ కెరియర్ లో మంచి సక్సెస్ అందుకున్న చిత్రాలు మహానుభావుడు, రాజా ది గ్రేట్, F2,F3 చిత్రాలు బాగానే పేరు తీసుకు వచ్చాయి. ఆ తర్వాత చాలా తక్కువ సినిమాలలో నటించింది.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం..
కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బీష్ణోయ్ మనవడి తో నిశ్చితార్థం చేసుకుని కొన్ని కారణాల చేత వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. అలా మెహ్రిన్ కొన్నేళ్లు సైలెంట్ గా ఉండి మళ్లీ F-3 చిత్రంతో కం బ్యాక్ ఇచ్చింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు పెద్దగా తెలుగులో రాలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు రకాల విషయాలను కూడా తెలియజేస్తుంది. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది మెహ్రిన్.
హాస్పిటల్ బెడ్ పైనుంచి ఫోటో..
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్టును సైతం షేర్ చేసింది… ఈ పోస్టులో మెహ్రిన్ తన చేతికి ఒక సెలైన్ బాటిల్ పెట్టుకొని ఉన్న ఫోటోని సైతం షేర్ చేసింది. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోయిన్ కి ఏమైంది అంటూ మెహ్రీన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం నెట్టింట వైరల్ గా అవుతోంది. మరి ఈ విషయం పైన మెహ్రీన్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.
పెళ్లికి ముందే ఎగ్ ఫ్రీజ్..
గడిచిన కొద్ది రోజుల క్రితం మెహ్రీన్ కు పిల్లలు కణాలని ఉంది అంటూ తన ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నట్లు ప్రకటించింది.. ఇందుకోసం దాదాపుగా రెండేళ్ల పాటు ఈమె చాలా కష్టపడ్డానంటూ తెలియజేసింది. మెహ్రిన్ తెలుగు, హిందీ, తమిళం, పంజాబ్ వంటి భాషలలో కూడా నటించింది. ఏది ఏమైనా మెహరీన్ తాజాగా తనకు జరిగిన ఇలాంటి సంఘటనను షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఆమె ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
సక్సెస్ కావాలని ఫ్యాన్స్ ఆరాటం..
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాలలో నటించడం కోసమే నిశ్చితార్ధాన్ని సైతం క్యాన్సిల్ చేసుకుని ,ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు సినిమాలలో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇప్పుడేమో హాస్పిటల్ బెడ్ పై కనిపించి ఆశ్చర్యపరిచింది . ఏది ఏమైనా త్వరలోనే కోలుకొని మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నారు.