Megha Akash : సౌత్ క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్ (Megha Akash) అతి త్వరలో అత్తవారింట్లో అడుగు పెట్టబోతోంది. ఇన్ని రోజులుగా హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ త్వరలోనే తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధమైందన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం గ్రాండ్ గా జరగగా, ఇప్పుడు పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఇప్పుడు ఈ బ్యూటీ తన మెహేంది వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
మేఘా ఆకాష్ (Megha Akash) పెళ్లి వేడుకలు షురూ…
గత నెలలో సడన్ గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్ మేఘా ఆకాష్ ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయింది. ఆగస్టు 22న తన చిరకాల ప్రియుడు స్థాయి విష్ణుతో మేఘా ఆకాష్ (Megha Akash) ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంటి స్టార్స్ కి స్వయంగా పెళ్లి కార్డులు పంచింది. అలాగే సెప్టెంబర్ 2న శ్రీలంకలోని ఓ స్టార్ హోటల్లో తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేసింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం పెళ్లి పనులు షురూ కావడంతో తాజాగా తన కుటుంబం, స్నేహితులతో కలిసి ప్రీ మ్యారేజ్ ఈవెంట్లో భాగంగా మెహందీ వేడుకను జరుపుకున్నారు. చేతులకు మెహేంది పెట్టుకున్నాక మేఘ ఆకాష్ (Megha Akash) తనకు కాబోయే భర్తతో కలిసి రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 13న మెహేంది కార్యక్రమం గ్రాండ్ గా జరిగినట్టుగా సమాచారం. ఆ ఫోటోలను మేఘా ఆకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెహేంది డే అని క్యాప్షన్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పలువురు సినీ ప్రముఖులు త్వరలో ఒక్కటి కాబోతున్న ఈ దంపతులకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మేఘా ఆకాష్ (Megha Akash) పెళ్లి ఎక్కడంటే?
అయితే మేఘా ఆకాష్ (Megha Akash) పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఆమె కూడా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ హడావిడి చూస్తుంటే మరో రెండు రోజుల్లోనే మేఘ ఆకాష్, విష్ణుల పెళ్లి జరగబోతుందని టాక్ నడుస్తోంది. ఈ లవ్ బర్డ్స్ గత కొన్ని ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయాన్ని ఎక్కడా బయట పడకుండా చూసుకోవడం మాత్రమే కాకుండా, గత నెలలో పెద్దల అనుమతితో సడన్ గా నిశ్చితార్థం చేసుకుని అఫీషియల్ గా తమ లవ్ మ్యాటర్ ను బయటపెట్టారు. కానీ పెళ్లి వేదికను సీక్రెట్ గా ఉంచి, పెళ్ళయ్యాక కూడా ఇదే విధంగా ఫోటోలతో సరిపట్టేస్తుందేమో మేఘా.