Megha Akash.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని కొత్త బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ్ సినిమాలలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ హీరోయిన్ మేఘ ఆకాష్ (Megha Akash)ఇటీవల విష్ణు(Vishnu ) అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసింది. గత రెండు రోజులుగా ఈమె పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అలాగే మెహందీ, సంగీత్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా నేడు మూడుముళ్ల బంధంతో కొత్త బంధంలోకి అడుగు పెట్టింది మేఘ ఆకాష్. ఇకపోతే మేఘ ఆకాష్ విష్ణు ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.
మేఘ ఆకాష్ మెడలో విష్ణు మూడు ముళ్ళు ..
తాజాగా మేఘ ఆకాష్ మెడలో విష్ణు మూడు ముళ్ళు వేశారు. చెన్నైలో ఘనంగా వీరి పెళ్లి జరగగా.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు నూతన జంటను ఆశీర్వదించారు. ఇకపోతే పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కి కూడా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించగా , ఇప్పుడు నూతన దంపతులకు పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గోల్డెన్ కలర్ దుస్తుల్లో శ్రీమహావిష్ణువు, లక్ష్మీ దేవతల లాగా నూతన జంట చూసేవారికి అగుపించారు. మొత్తానికి అయితే పెళ్లికూతురు గెటప్ లో మహారాణిల అందరిని ఆకట్టుకుంది మేఘా ఆకాశ్ . ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
మేఘ ఆకాశ్ కెరియర్..
మేఘా ఆకాశ్ విషయానికి వస్తే , తెలుగు, తమిళ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లై అనే తెలుగు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈమె 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించింది. ఈమె మహిళా క్రిస్టియన్ కాలేజీ లేడీ ఆండాళ్ కళాశాలలో విద్యను పూర్తి చేసింది.. ఈమె తెలుగు చిత్రాల విషయానికి వస్తే 2018లో చల్ మోహన్ రంగా, 2019 లో తమిళంలో పేట అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈమె అదే ఏడాది మరో రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగు, తమిళ్ మాత్రమే కాదు హిందీ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. 2023లో రావణాసుర సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది . ఇక మను చరిత్ర అనే సినిమాలో కూడా నటించిన ఈమె మరో రెండు చిత్రాలను లైన్ లో ఉంచింది. ఈ రెండు సినిమాలు కూడా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి.
మేఘా ఆకాష్, విష్ణు దంపతులను ఆశీర్వదించడానికి తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ విచ్చేశారు శనివారం నిర్వహించిన రిసెప్షన్ కు ఆయన విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ఇక ఈరోజు ఆదివారం చెన్నైలోని ఒక ఫంక్షన్ హాల్ లో మేఘ ఆకాష్ మెడలో ఆమె ప్రియుడు సాయి విష్ణు మూడు ముళ్ళు వేశారు.
View this post on Instagram