Megastar Chiranjeevi: విశ్వంభర లేటెస్ట్ అప్డేట్, మెగాస్టార్ అభిమానులకు పండుగే

Megastar Chiranjeevi: బింబిసారా(Bimbisara) సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వశిష్ట(Vasista). మొదటి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోతో కూడా ఆ టైంలో అద్భుతమైన హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. బింబిసార తో మంచి హిట్ అందుకొని దర్శకుడుగా తన తాను ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో నిలబడ్డాడు. రెండువ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి లాంటి దర్శకుడు తో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు.

వశిష్ఠ ప్రస్తుతం చేస్తున్న సినిమా విశ్వంభర(Vihswambhara). మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సరసన త్రిష(Trisha) ఈ సినిమాలో కనిపించనుంది. ఏఆర్ మురుగదాస్(Ar Muragadas) దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన స్టాలిన్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ తో జతకడుతున్నారు త్రిష. ఈ సినిమాను సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో తోనే మంచి అంచనాలను క్రియేట్ చేశారు. పంచభూతాలను ఏకం చేసే కాలచక్రాన్ని పోస్టర్ లో చూపిస్తూ ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి ఆడియన్స్ ఏ విధమైన అనుభూతిని పొందారో ఈ సినిమాను చూసినప్పుడు కూడా అదే రకమైన అనుభూతిని పొందుతారు. అని చాలా కాన్ఫిడెంట్ తో చెబుతున్నారు ఈ మూవీ టీం. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ సాంగ్ త్వరలో షూట్ చేయనన్నట్లు తెలుస్తోంది దీంట్లో మెగాస్టార్ డాన్స్ మూమెంట్స్ తో పాటు త్రిష మెగాస్టార్ మధ్య లవ్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Viswambhara

ఇకపోతే ఈ విశ్వంభర సినిమాను సంక్రాంతి కానుక 2025 లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మామూలుగా సంక్రాంతి సినిమాకి ఒక యావరేజ్ టాక్ వస్తేనే, ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అదే సినిమాకు ఒక సూపర్ హిట్ టాక్ వచ్చిందంటే అది రికార్డ్స్ ను తిరగరాస్తుంది. ఈ సినిమా పైన ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా ఏ మాత్రం బాగా వచ్చి వర్క్ అవుట్ అయినా కూడా ఇది సరికొత్త కలెక్షన్ కి, సరికొత్త సంచలనాలకి దారి తీయబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు