Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి ఎలాగైనా తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ ని చేస్తున్నారు. ఇప్పటికే సినిమా 70 శాతానికి పైగా పూర్తవగా, బర్త్ డే సందర్బంగా కాస్త గ్యాప్ తీసుకున్న చిరు త్వరలోనే మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్నారు. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభర సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అలాగే, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక విశ్వంభరని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి (Vashista Mallidi) డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా విశ్వంభర నుండి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్.
విశ్వంభర గిఫ్ట్ పై డిస్సపాయింట్ లో ఫ్యాన్స్..
ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న విశ్వంభర నుండి చిరు బర్త్ డే సందర్బంగా మేకర్స్ స్పెషల్ సప్రయిజ్ ఇస్తామని ముందుగానే చెప్పడం జరిగింది. అయితే అభిమానులు ఖచ్చితంగా టీజర్ వస్తుందని అనుకున్నారు. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వదిలి దీంతో సంతృప్తి చెందామన్నారు. పైగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అంత క్రియేటివిటీగా ఆసక్తికరంగా లేదన్నది మెగాభిమానుల వాదన. విశ్వంభర పోస్టర్ బాగానే ఉన్నా, సరికొత్తగా అయితే లేదని అంటున్నారు. చిరు ఫ్యాన్స్ అయితే ఒక అంజి, జగదేకవీరుడు లాంటి సినిమాల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ మేకర్స్ ఫస్ట్ లుక్స్ తో ఆ స్థాయిలో మెప్పించలేదని అంటున్నారు.
సంక్రాంతి కి ఖచ్చితంగా వస్తారా?
అయితే చిరంజీవి విశ్వంభర నుండి ఈ బర్త్ డే కి టీజర్ వచ్చి ఉంటే సినిమాకి బాగా ప్రమోట్ అయ్యేది. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు టీజర్ వదులుతారని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే సంక్రాంతికి దాదాపు నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. మరి ప్రమోషన్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే అసలు సంక్రాంతి కల్లా షూటింగ్ పూర్తవుతుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశ్వంభరలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా, రమ్య పసుపులేటి, ఆశికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి వంటి హీరోయిన్లు చిరు చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుండి టీజర్ ఎప్పుడొస్తుందో చూడాలి.