Matka : గత కొంతకాలంగా వరుణ్ తేజ్ వరుస డిజాస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే వరుణ్ మట్కా సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి ఒక పిక్ లీక్ అయ్యింది. ఆ పిక్ లో వరుణ్ తేజ్ లుక్ పవన్ కళ్యాణ్ ను పోలి ఉండడంతో ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మట్కా పిక్ లీక్.., బిగ్ ట్విస్ట్ కూడా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యాక్షన్ డ్రామా ‘మట్కా’ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ కుమార్ ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్ నుండి లీక్ అయిన చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లీకైన పిక్ లో వరుణ్ తేజ్ క్లీన్ షేవ్, గిరజాల జుట్టుతో అచ్చం తన బాబాయ్ ను తలపిస్తున్నాడు. అయితే అతని మెడలో ఎర్రటి టవల్ ఉండడం ఆసక్తికరమైన విషయం. శ్రామిక వర్గానికి చిహ్నంగా ఎర్రటి టవల్ ధరించడం సర్వసాధారణమైనప్పటికీ, అది పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ద్వారా మరింత పాపులర్ అయ్యిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుణ్ రెడ్ టవల్ ధరించిన ఈ సీన్ ఏంటో తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం మాత్రం పక్కా. అయితే ఇందులో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా కన్పించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ తాజాగా లీకైన పిక్ మాత్రం ఆ గ్యాంగ్ స్టర్ పాత్రకు సంబంధించినది కాదని తెలుస్తోంది. ఇక పిక్ తో పాటు లీకైన బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇందులో వరుణ్ తేజ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ లీక్డ్ పిక్ లో కన్పిస్తున్నది వరుణ్ మట్కా మూవీలో చేస్తున్న రెండవ పాత్ర అని సమాచారం.
సినిమాలో ఈ సీన్స్ హైలెట్
మరోవైపు ఓల్డ్ వైజాగ్ సెట్‌లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా ‘మట్కా’ తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా దర్శకుడు కరుణ కుమారే రాశారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్ర కోసం ఎంపికైంది. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న మట్కా మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.