Manchu Vishnu..మంచు ఫ్యామిలీ.. సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కుటుంబం నుంచి వచ్చిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) తన అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.. అంతేకాదు ఆయన వారసులు మంచు విష్ణు(Manchu Vishnu)ప్రస్తుతం మా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉండగా, చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) కూడా హీరోగా మారారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే మంచు ఫ్యామిలీ.. సినీ ఇండస్ట్రీలో మెగా , నందమూరి , అక్కినేని కుటుంబాల కంటే తమ కుటుంబమే పెద్దదని , తమ కుటుంబానికి అటు సినీ పరంగా ఇటు రాజకీయపరంగా మంచి పేరు ఉందని, ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తమకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని ఎప్పుడూ గొప్పలు పోతూ ఉంటారు.ముఖ్యంగా వీరు చెప్పే విషయాలకు, అక్కడ జరిగే విషయాలకు అసలు పొంతనే ఉండదు. అందుకే ఈ కుటుంబంపై చాలామంది విమర్శలు, ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.
ప్రజల గోడు మంచు ఫ్యామిలీకి పట్టదా..
ఎప్పటికప్పుడు తమది పెద్ద కుటుంబం, తాము గొప్పవాళ్ళము అంటూ చెప్పుకునే ఈ మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ విషయం కనిపించలేదా..? కనీసం ఈ విషయం వీరి దృష్టికి రాలేదా? అనే అనుమానాలు అటు సినీ వర్గాలలోనే కాదు ఇటు ప్రజలలో కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించి ప్రాణాలు కూడా కోల్పోయారు. పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా వరద ఉధృతి కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఎవరైనా వచ్చి తమకు సహాయం చేయకపోతారా అంటూ ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవతో ప్రజలు ఈ వరద ఉధృతి నుండి బయటపడ్డారని చెప్పవచ్చు.సినీ సెలబ్రిటీలు కూడా చాలామంది ఒక్కొక్కరిగా ముందుకొచ్చి తమ వంతు సమయంగా రూ.1 లక్ష మొదలుకొని రూ.10కోట్ల వరకు విరాళాలు ప్రకటించి తమ మంచి మనసులను చాటుకున్నారు.
వేలకోట్ల ఆస్తులు.. రూపాయి దానం చేయడానికి పిసినారితనం..
జూనియర్ సెలబ్రిటీలు కూడా విరాళాలు అందజేశారు. అయితే ఎప్పుడు తాము గొప్పవాళ్ళం, అందరికీ సహాయం చేస్తామని చెప్పుకొని తిరిగే మంచు ఫ్యామిలీకి ఇంత పెద్ద నష్టం కనిపించలేదా? అనే వాదన తెరపైకి వచ్చింది. వరద బాధితులు అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటే, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంచు ఫ్యామిలీ నుంచి ప్రకటించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ సమయంలో మంచు ఫ్యామిలీ పై విమర్శలు కూడా ట్రోల్స్ రూపంలో వెళ్ళు వెత్తుతున్నాయి. మా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మంచు విష్ణు తమ సినిమా కన్నప్ప మూవీ పై అలాగే వాళ్ళ కుటుంబంపై ట్రోల్స్ చేసిన యూట్యూబ్ చానల్స్ ను బ్యాన్ చేయించి, చాలామందిపై కేసులు కూడా పెట్టారు. వాళ్ళ సెలబ్రిటీలకు, వాళ్ళ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు అంతగా రెస్పాండ్ అయిన ఈయన కేసులు, బ్యాన్ వరకు వెళ్ళారే ..మరి వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు వీరికి కనిపించలేదా..? విరాళం ఇవ్వకపోగా కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు..
మా అధ్యక్షుడికి మంచి మనసే లేదా..
అంటే మీ కుటుంబానికి, మీ సెలబ్రిటీలకు వచ్చిందే కష్టమా ? ఇక్కడ మిమ్మల్ని ఈ స్థాయిలో కూర్చో పెట్టిన ప్రజలకు కష్టం వస్తే కనీస బాధ్యతగా స్పందించాల్సిన అవసరం మీకు లేదా అంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా కోసం ఏకంగా రూ .500 కోట్లు ఖర్చుపెట్టారు. తెరపై కనిపించే బొమ్మ కోసం ఇంత ఖర్చు పెట్టారే.. అక్కడ ప్రజలు ప్రాణాలు పోతుంటే ఎందుకు స్పందించలేదు.. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ సంస్థల ద్వారా కూడా వీరికి భారీగా ఆదాయం వస్తోంది. మరొకవైపు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పేరిట విద్యార్థులను అన్యాయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నారు అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇంత డబ్బు ఉన్న ఈ మంచు ఫ్యామిలీ కనీసం లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదంటే ఇక వీరు ఎంత దీనస్థితిలో ఉన్నారో అంటూ నెటిజన్స్ సైతం ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మంచు ఫ్యామిలీ ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి.