Manchu Lakshmi: సాయం చేయండి అభ్యర్థన.. షాక్ లో ఫ్యాన్స్..!

Manchu Lakshmi.. మంచు మోహన్ బాబు వారసురాలు ప్రముఖ నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడమే కాదు పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అభిమానులను సంపాదించుకుంది.. ఇకపోతే హాలీవుడ్ లో కూడా సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ.. అప్పుడు కూడా నటిగానే ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ మీద ఎన్ని ట్రోల్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆమె యాస బాసపైనే ఈ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.. అయితే వాటిని పెద్దగా పట్టించుకోదు.. అలా అని సోషల్ మీడియాకి దూరంగా ఉండదు.. ట్విట్టర్ , యూట్యూబ్, ఇన్స్టా అంటూ ప్రతి దాంట్లో కూడా ఈమెకు అకౌంట్ ఉంది.. ఎప్పటికప్పుడు వీడియోలు, ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది .. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక సహాయాన్ని కోరుతూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడమే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Manchu Lakshmi: Please help.. Fans in shock..!
Manchu Lakshmi: Please help.. Fans in shock..!

సహాయం చేయండి అంటూ మంచు లక్ష్మి అభ్యర్థన..

అసలు విషయంలోకి వెళితే.. తాజాగా మంచు లక్ష్మి తన కుమార్తె విషయంలో సహాయం చేయండి అంటూ ఒక పోస్ట్ చేయగా.. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సహాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని… ఇన్ స్టా వేదికగా తెలిపింది ఈ ముద్దుగుమ్మ .. ఈ మేరకు..నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు.. కానీ ఇప్పటివరకు నాకు అది అందలేదు ..నా కూతురు స్కూల్ హాలిడేస్ కూడా ముగిసాయి.. నేను వెళ్లాల్సిన ఫ్లైట్ జూలై 12న ఉంది .. కానీ నాకు వీసా ఇంకా అందలేదు.. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది.. ఇప్పటికే రెండు నెలలు దాటింది.. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా అంటూ పోస్ట్ చేసింది..

కూతురు కోసం సహాయం..

నాకు అమెరికా వీసా జారీ అయ్యి నెలరోజులు అవుతున్నా.. ఎంబసీ కార్యాలయం సైట్లో నెట్వర్క్ ప్రాబ్లం కారణంగా నాకు వీసా అందలేదు. మరోవైపు నా బిడ్డ స్కూల్ తెరిచే సమయం దగ్గర పడుతుంది. ఈ విషయంలో ఎవరైనా నాకు సహాయం చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే మంచు లక్ష్మీ పోస్టు చూసినవారు రకరకాలుగా సలహాలు ఇస్తున్నారు. మరి కొంతమంది మాకు కూడా ఇదే సమస్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి చూద్దాం ఎవరు మంచు లక్ష్మి సమస్యను తీరుస్తారో.

- Advertisement -

మంచు లక్ష్మి సినిమాలు..

మంచు లక్ష్మీ విషయానికి వస్తే.. ఇటీవల ఈమె యక్షిణి వెబ్ సిరీస్ లో జ్వాలాముఖి క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించింది.. ఇక త్వరలోనే ఆదిపర్వం అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.. మరోవైపు బుధవారం వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ వేడుకల్లో సందడి చేసిన ఈమె.. చాలా రోజుల తర్వాత చెన్నై మిత్రులతో కలిసి సందడి చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు