Malaika Arora.. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా (Malaika Arora) తండ్రి ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో యావత్ బాలీవుడ్ పరిశ్రమ ఆశ్చర్యానికి గురైంది. ముంబైలో తన నివాసంలో ఆయన బుధవారం ఉదయం ఏడంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయన మరణ వార్త ఒక బాలీవుడ్ నే కాదు అన్ని సినీ పరిశ్రమలను ఉలిక్కిపడేలా చేసింది. ఒక స్టార్ హీరోయిన్ తండ్రి అయ్యుండి ఇలా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల కారణం ఏంటి అంటూ ఆమె అభిమానులే కాదు నెటిజన్స్ కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు.
తండ్రి వయసు 62.. కూతురు వయసు 50 ఏళ్లు..
ఇకపోతే తండ్రి అనిల్ మెహతా మరణం తర్వాత సోషల్ మీడియా ద్వారా మలైకా అరోరా ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది.. మలైకా ఆ స్టేట్మెంట్లో ఎమోషనల్ అవుతూ.. మా ప్రియమైన నాన్న అనిల్ మెహతా చనిపోయారని తెలియజేయడానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఆయన మరణంతో మా కుటుంబం అంతా ఒక్కసారిగా షాక్ కి గురైంది. దయచేసి ఈ కష్టకాలంలో మా ప్రైవసీ కి కొంచెం విలువ ఇవ్వండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది మలైకా అరోరా. ఇకపోతే ఈ అనిల్ మరణం తర్వాత ఒక అనుమానం అభిమానులను తీవ్రంగా వేధిస్తోంది. అదేమిటంటే మలైకా అరోరా వయసు 50 సంవత్సరాలు అయితే ఆత్మహత్య చేసుకున్న అనిల్ వయసు 62 సంవత్సరాలు. ఇక తండ్రి – కూతురు మధ్య ఈ పన్నెండు సంవత్సరాల గ్యాప్ ఏంటి..? అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ మెహతా.. మలైకా సొంత తండ్రి కాదా..
అసలు విషయంలోకెళితే అనిల్ మెహతా మలైకా అరోరా కన్న తండ్రి కాదు. మలైకా తల్లి జాయిస్ పాలీకార్ప్ ఒక మలయాళ క్రిస్టియన్. ఈమె పంజాబ్ కి చెందిన అనిల్ అరోరా ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. అయితే మలైకాకి 11 ఏళ్లు ఉన్నప్పుడు అనిల్ అరోరా , జాయిస్ పాలీ కార్ప్ విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత కూతుర్లు మలైకా అరోరా, అమృత అరోరాలతో చెంబూర్ కి వెళ్లిపోయింది జాయిస్. అయితే అక్కడ జాయిస్ కి తన మాజీ బర్త పేరు ఉన్న ఒక వ్యక్తి పరిచయమయ్యారు. ఆయన పేరు అనిల్ కుల్దీప్ మెహతా. ఈయనను ప్రేమించి పెళ్లి చేసుకుంది జాయిస్. ఇక్కడ జాయిస్ కంటే అనిల్ వయసు చాలా తక్కువ కావడం గమనార్హం. దీంతో అనిల్ మెహతా.. మలైకా, అమృతాలకు మారు తండ్రి అయిపోయారు. అయితే ఈయన మారు తండ్రి అయిన వీరిద్దరితో ఎంతో మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు.
మారు తండ్రి అయినా ప్రాణం పెట్టుకున్న మలైకా..
ఇక మలైకా అరోరా కంటే మారు తండ్రి అనిల్ మెహతా మధ్య కేవలం 12 సంవత్సరాల మాత్రమే వయసు తేడా ఉంది. ఇక ఇప్పుడు అనిల్ ఆత్మహత్య తర్వాత ఆయన వయసు గురించి చర్చ జరగడంతో ఇలా వారి కుటుంబం గురించి వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సొంత తండ్రి కాకపోయినా అంతకంటే ఎక్కువ ఇష్టపడింది మలైకా అరోరా. ఇక ఇప్పుడు ఆ స్టెప్ ఫాదర్ మరణించడంతో ఆమె బాధ వర్ణనాతీతం చెప్పవచ్చు.