Mahesh Babu : టాలీవుడ్ స్టార్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి తెలియని వాళ్లు ఉండరేమో.. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నాడు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 29 వ సినిమాను చెయ్యబోతున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మహేష్ బాబు లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
త్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తెరకేక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. సినిమా స్టోరీ కూడా రెడీ అయ్యింది. కానీ జక్కన్న మాత్రం దీనిపై ఎటువంటి అప్డేట్ ను ఇవ్వలేదు. అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్నాడు.. కానీ సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు.. కాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ రాబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా అప్డేట్ ఇస్తారని ప్రిన్స్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. కానీ జక్కన్న ఆ ఆశల మీద నీళ్లు చల్లాడు. ఒక్క అప్డేట్ ఇవ్వలేదు.. అది నిరాశను కలిగించింది. కానీ తాజాగా మహేష్ బాబు న్యూ లుక్ ఫోటోలు మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఆ ఫోటోలల్లో మహేష్ కాఫీ కలర్ టీ షర్ట్ లో క్యాప్ పెట్టుకొని పోని కూడా వేసుకొని చాలా స్టైల్ గా కనిపించాడు. సితార, నమ్రత, గౌతమ్ కూడా ఉన్నారు. వీరంతా ఎయిర్ పోర్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్తున్నట్లు సమాచారం. ఇక SSMB29 సినిమాను ప్రకటించి కూడా దాదాపు ఏడాది పైన అయ్యింది. ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తి చెయ్యకపోవడం గమనార్హం.. స్క్రిప్ట్ కూడా ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వంచర్ గా రాబోతున్న ఈ సినిమాను సౌత్ ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది..