Mahesh Babu.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు (Mahesh Babu) ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ మరొకవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. వస్త్ర రంగంలో అడుగుపెట్టిన ఈయన, మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. అంతేకాదు పలు మహా నగరాలలో మల్టీప్లెక్స్ లు నిర్మించి, భారీ ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జాతీయస్థాయిలో 8వ స్థానం సంపాదించుకున్నారు మహేష్ బాబు. మరి ఏ రంగంలో ఈయన ఈ స్థాయి అందుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
జాతీయస్థాయిలో 8వ స్థానం..
సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత థియేటర్ ఏఎంబి సినిమాస్ (AMB Cinimas)మరో ఘనత సాధించింది. దేశంలో అత్యధికంగా ప్రతిరోజు ఎక్కువ మంది ప్రజలు సందర్శించే మాల్స్ ను నివేదిక GeoIQ ప్రకటించింది. ఈ నివేదికలో హైదరాబాదులోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ జాతీయస్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఈ మాల్ లోని మహేష్ బాబుకు చెందిన ఏ.ఎం.బీ సినిమాస్ థియేటర్ కూడా ఉండడం గమనార్హం. శరత్ సిటీ క్యాపిటల్ కు అత్యధికంగా ఏఎంబి సినిమాస్ ను పెద్ద సంఖ్యలో ప్రజలు, సినిమా అభిమానులు సందర్శిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోనే టాప్ సినిమా మల్టీప్లెక్స్ లలో AMB సినిమాస్ మొదటి స్థానంలో నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మినీ సైజ్ ఛార్మినార్..
ఈ శరత్ సిటీ మాలలో చిన్నపిల్లలను మొదలుకొని ఆడవారు, మగవారు అందరికీ కావలసిన దుస్తులతోపాటు యాక్సెసరీస్, జువెలరీ ఐటమ్ ఇలా ఒక్కటేమిటి బయట మనకు కావలసిన ప్రతి వస్తువు కూడా ఈ మాల్ లో లభిస్తుంది. దాదాపు 8 అంతస్తులు కలిగిన ఈ మాల్ మినీ సైజ్ ఛార్మినార్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఛార్మినార్ లో లభించే ప్రతి వస్తువు కూడా ఇక్కడ మనకు లభించడమే కాదు అత్యంత క్వాలిటీతో, అత్యంత తక్కువ ధరకు లభిస్తుందని ఈ మాల్ సందర్శించిన వారు చెబుతూ ఉంటారు.
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ప్రత్యేకతలు..
ఇకపోతే ఈ మాల్ ప్రత్యేకతల విషయానికి వస్తే..1,931,000 చదరపు అడుగుల రిటైల్ మాల్ స్థలాన్ని కలిగి ఉంటుంది. నాలుగు అంతస్తులలో 1400 ఆటోమొబైల్స్ తో పాటు 4000 బైకులను పార్కింగ్ చేయడానికి స్థలం కూడా ఉంది. ఇక ఇక్కడ ఆహారం, కిరాణా, డిజిటల్, ఫ్యాషన్, పాదరక్షలు, ఇంటికి కావాల్సిన గృహోపకరణాలు, గిఫ్ట్ ఐటమ్స్, పిల్లలకు వినోదంతో పాటు అడ్వెంచర్ చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా ఒక్కటేమిటి మనకు కావలసిన ప్రతి అంశం మనం ఇక్కడ చూడవచ్చు. పిల్లలకు , పెద్దలకు వినోదబరితమైన ఇండోర్ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి దాదాపు 430 బ్రాండ్ ల వస్తువులను, దుస్తులను మనం ఇక్కడ సొంతం చేసుకోవచ్చు. ఇక ప్రజలకు కావలసినవి అన్నీ సులభంగా ఒకే చోట దొరుకుతాయి కాబట్టి ఈ మాల్ అత్యంత ప్రజాదారణ పొందింది. అందుకే జాతీయస్థాయిలో 8వ స్థానాన్ని అందుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసి మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.