Maharshi : 5 ఏళ్ళ తర్వాత మహేష్ బాబు హిందీ డిజిటల్ ప్రీమియర్ కి మోక్షం… మరి 6ఏళ్ళ చరణ్ సినిమా సంగతేంటి?

Maharshi : టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన తెలుగు సినిమాలు హిందీ లో ఈ మధ్య భారీ రేటుకు అమ్ముడు పోతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా, డిజిటల్ హక్కులు మాత్రం కోట్లల్లో అమ్ముడు బోతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ లో ప్లాప్ అయిన కొన్ని యాక్షన్ సినిమాలు సైతం హిందీ టివి ఛానెల్ లలో దుమ్ములేపుతున్నాయి. ముఖ్యంగా బోయపాటి లాంటి దర్శకుల సినిమాలు హిందీ లో యూట్యూబ్ లో రిలీజ్ అయి కూడా ఏ రేంజ్ లో వ్యూస్ సాధిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ నిర్మాతలు కూడా అందుకే భారీ బడ్జెట్ తో మీడియం రేంజ్ సినిమాలు కూడా నిర్మిస్తూ, హిందీ డిస్ట్రిబ్యూటర్లని ఆకర్షిస్తూ, భారీ రేటుకి సినిమాలని అమ్ముతారు. ఇక్కడ మీడియం రేంజ్ హీరోలైన రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాలకి కూడా అక్కడ మంచి గిరాకీ ఉంది. అయితే కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రం హిందీలో ఎప్పుడో భారీ రేటుకి అమ్ముడు పోయినా అనివార్య కారణాల వల్ల హిందీ టెలివిజన్ లో స్ట్రీమింగ్ కాలేకపోతుంటాయి. అయితే ఇప్పుడు అయిదేళ్లుగా టెలివిజన్ స్ట్రీమింగ్ కి నోచుకోని ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఇప్పుడు టెలివిజన్ స్ట్రీమింగ్ కి రిలీజ్ కి రెడీ అయింది.

Maharshi ready for Hindi television premiere, but 'Rangasthalam'?

విడుదలైన ఐదేళ్లకు మహర్షి టెలివిజన్ స్ట్రీమింగ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి (Maharshi) సినిమా ఐదేళ్ల కిందట 2019 లో సమ్మర్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయి వంద కోట్ల వసూళ్ళదుకుంది. వంశీ పైడి పల్లి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు CEO గా కనిపించారు. అలాగే అల్లరి నరేష్ ప్రత్యేకపాత్రలో నటించారు. ఇక తెలుగులో ఎప్పుడో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ లో మాత్రం ఇప్పటివరకు టివిలో స్ట్రీమింగ్ కాలేదు. ఇక ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించుతూ, మహర్షి సినిమా ఫైనల్ గా టెలివిజన్ స్ట్రీమింగ్ కానుంది. మహర్షి సినిమాను గోల్డ్ మైన్స్ ఛానెల్ లో ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు టెలివిజన్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

మరి ఆరేళ్ళ చరణ్ సినిమా సంగతేంటి?

అయితే ఇలాగే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా హిందీలో ఇప్పటివరకు టెలికాస్ట్ అవ్వలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది. పైగా రంగస్థలం హిందీ రేటు కూడా, అప్పటికీ రామ్ చరణ్ కెరీర్ హైయెస్ట్ రేటుకి అమ్ముడు పోయింది. ఇక రంగస్థలం సినిమా థియేటర్లలో 2018 మార్చి 29న థియేటర్లలో రిలీజ్ అయి ఏకంగా 127 కోట్ల షేర్ సాధించి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక రంగస్థలం తెలుగులో టెలివిజన్ స్ట్రీమింగ్ లో కూడా దుమ్ములేపే రేటింగ్స్ సాధించింది. కానీ ఇప్పటివరకు హిందీలో మాత్రం స్ట్రీమింగ్ అవ్వలేదు. RRR విడుదలైన సమయంలో కూడా రంగస్థలం టెలివిజన్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం చేసినా కాలేదు. ఇప్పుడు మళ్ళీ రంగస్థలం ని హిందీలో టెలివిజన్ స్ట్రీమింగ్ చేయాలనీ నార్త్ రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు హిందీలో మోక్షం ఎప్పుడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు