MaaNannaSuperHero Teaser : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన సుధీర్ బాబు వరుస ప్లాపులతో డీలా పడ్డాడు. లాస్ట్ ఇయర్ మామ మశ్చీంద్ర తో డిజాస్టర్ అందుకోగా, ఈ ఇయర్ హంట్, హరోంహర సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు. సుధీర్ బాబు (Sudheer babu) ఇప్పుడు నిఖార్సైన హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈసారి ప్రయోగాలు అచ్చి రావట్లేదని ఈసారి ఒక సీరియస్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సుధీర్‌బాబు హీరోగా రూపొందుతోన్న సినిమా “మా నాన్న సూపర్‌హీరో” (MaNanna Superhero). ఈ సినిమాను అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తుండగా, వి సెల్యులాయిడ్స్, సీఏఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సునీల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో…
ఇక సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న “మా నాన్న సూపర్ హీరో” (MaaNannaSuperHero) సినిమా యొక్క టీజర్ ని తాజాగా కాసేపటికిందే చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా టీజర్ ను నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక “మా నాన్న సూపర్ హీరో” టీజర్ ఆద్యంతం ఎమోషనల్ కంటెంట్ తో, తండ్రి కొడుకుల భావోద్వేగాలతో నిండి ఉంది. ఒక సగటు తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ జర్నీ ను ఈ చిత్రంలో చూపించనున్నారు. టీజర్ లో సుధీర్ బాబు తో పాటుగా, సాయి చంద్, షాయాజీ షిండే లు కనిపించగా, వీరిలో సుధీర్ బాబు తండ్రిగా నటించింది ఎవరో సస్పెన్స్ గా ఉంచారు. ఇక టీజర్ లో “అమ్మని అన్నం పెట్టమంటే అడుక్కున్నట్టు కాదు”… “నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు” అంటూ సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ చాలా బాగుంది.
ఈసారి సక్సెస్ కొడతాడా?
ఇక మా నాన్న సూపర్ హీరో టీజర్ చూస్తుంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే సినిమాలో ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. ఇక టీజర్ లో జయ్ క్రిష్ ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ఇక ఆర్ణ (Aarna) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మా నాన్న సూపర్ హీరో సినిమాను అక్టోబర్ 11, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో సుధీర్ బాబు హిట్ కొట్టెలనే ఉన్నాడు.