Janaka Ayithe Ganaka : హీరో సుహాస్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా నాలుగు సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది వచ్చిన రెండు సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే “జనక అయితే గనక “.. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరాకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఆ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ సక్సెస్ ఫుల్ కెరీర్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా నటుడు తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. బలగం ప్రొడక్షన్స్‌పై హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జనక అయితే గనక (జాగ్) అని పేరు పెట్టారు. ఆ సినిమా నుంచి తాజాగా నా పేవరేట్ నా పెళ్ళామే అంటూ సాగే లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కృష్ణ కాంత్ లిరిక్స్ను అందించారు. విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుంది.
ఇకపోతే ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టీజర్ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేసాయి. ప్రభాస్ ‘సాలార్’లో రచయితగా పనిచేసినందుకు పేరుగాంచిన సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంగీత విపిన్ మహిళా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, ఆచార్య శ్రీకాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన బలగం వంటి సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని అందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం.