VV Vinayak on Hospital : ఒక్కప్పటి స్టార్ అండ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కామినేని ఆస్పత్రిలో ఉన్నాడు అనే వార్త నిన్న సాయంత్రం నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఫిల్మీ ఫై ఇప్పటికే ఆర్టికల్ రాసింది. అయితే తాజాగా వివి వినాయక్ హెల్త్ కి సంబంధించి ఫిల్మీఫై కి అప్టేట్ వచ్చింది. అది ఏంటంటే….?
వివి వినాయక్ గత కొన్ని రోజుల నుంచి లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారట. దీంతో గత 10 రోజుల క్రితం హైదరాబాద్ లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు జరిపి కొద్ది రోజుల పాటు పరివేక్షనలో ఉంచారు. తాజాగా వివి వినాయక్ కి లివర్ ఆపరేషన్ ను డాక్టర్లు విజయవంతగా పూర్తి చేశారట. మరో 10 రోజులు వివి వినాయక్ కామినేని డాక్టర్ల అబ్జర్వేషన్లోనే ఉండబోతున్నట్టు ఫిల్మీ ఫైకి సమాచారం అందింది.
అలాగే వివి వినాయక్ ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం మెరుగు పడుతుందని సమాచారం. మరో 10 రోజుల తర్వాత వినాయక్ కామినేని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే చాన్స్ ఉంది. దీనిపై పూర్తి సమాచారం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
కాగా, వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మాస్ స్టోరీ లను తీసుకుని ఎందరో హీరోలకు ఇమేజ్ ను ఇచ్చాడు వినాయక్. ఇప్పుడు ఆనారోగ్య సమస్యలతో ఉన్నాడని తెలుస్తుంది.