Lavanya – Raj Tarun.. కొద్ది రోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో రాజ్ తరుణ్ ఆయన ప్రేయసి లావణ్య రోజుకొక ట్విస్ట్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విషయంలో ఆర్జె శేఖర్ బాషా అత్యంత కీలకంగా మారిపోయారు.ఏకంగా లావణ్యతో ఈయన లైవ్ డిబేట్ పెట్టి మరి వైరల్ అయ్యాడు. మొన్నా మధ్య లావణ్య ఏకంగా చెప్పులతో ఈయనపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత మూడు రోజుల క్రితం లావణ్య.. తన పై ఆర్ జె శేఖర్ బాషా శారీరకంగా దాడి చేశారు అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి ఆ పేపర్తో మీడియా ముందుకొచ్చింది.
ఆర్.జే.శేఖర్ నుంచి ప్రాణహాని ఉంది – లావణ్య
ఆర్. జే.శేఖర్ బాషా.. తనపై దాడి చేశాడని, కడుపుపై తన్నాడని, వీపుపై బాదాడు అంటూ కామెంట్లు చేసింది. అంతేకాదు తన ప్రైవేట్ పార్ట్స్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు శేఖర్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకేదైనా జరిగితే దానికి శేఖర్ బాషా కారణం అంటూ తెలిపింది. ఈ నేపథ్యంలోని ఆర్జె శేఖర్ కు పోలీసులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
శేఖర్ బాషా పై కేస్ ఫైల్..
అసలు విషయంలోకి వెళ్తే.. శేఖర్ బాషా పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో తనను శేఖర్ బాషా కాలితో తన్ని భౌతిక దాడికి పాల్పడ్డాడు అంటూ లావణ్య ఫిర్యాదు చేసింది అందుకే రెండు సెక్షన్ల కింద శేఖర్ బాషా పై పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే లావణ్య, రాజ్ తరుణ్ కేసులో రోజుకొక ట్విస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
శేఖర్ బాషా కూడా లావణ్య పై ఆరోపణలు..
ఇకపోతే శేఖర్ బాషా కూడా లావణ్య పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు చేతికి కట్టుతో హాస్పిటల్ నుంచి మీడియాకు.. తనపై లావణ్య రౌడీలతో దాడి చేయించిందని తెలిపారు. అర్ధరాత్రి వెళ్తుండగా రౌడీలతో కాపు కాసి దాడి చేయించిందని ,తన చెయ్యి కూడా విరిగింది అంటూ శేఖర్ బాషా మీడియా ముందు చెప్పుకొచ్చారు. కానీ శేఖర్ బాషా పై పోలీసులు కేసు ఫైల్ చేసి అరెస్టు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
రాజ్ తరుణ్ – లావణ్య విషయంలో రోజుకొక మలుపు..
రాజ్ తరుణ్ , లావణ్య విషయానికి వస్తే గత 11 సంవత్సరాలుగా వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపారని, అయితే రాజ్ తరుణ్ ఆమెను పెళ్లి చేసుకుని రెండుసార్లు గర్భవతిని చేశాడని, అంతేకాదు ఎవరికీ తెలియకుండా అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య తన గోడు వెళ్ళబోసుకుంది. ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉండడం వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు రాజ్ తరుణ్ కావాలి ..? న్యాయం జరగాలి అంటూ పోరాడిన ఈమె ఇప్పుడు రాజ్ తరుణ్ వద్దు.. అతడు లేడనుకొని అతడి ఫోటోకి దండ వేసి బ్రతికేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ విషయాలు అలా ఉంటే ఇప్పుడు రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా లావణ్య మధ్య జరుగుతున్న ఈ గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.