KrithiShetty : ఒకేసారి రెండు భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.. మరి ఎక్కడ కలిసొస్తుందో?

Krithi Shetty : టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో ఉవ్వెత్తున ఎగిసిపడిన కన్నడ భామ కృతి శెట్టి. బేబమ్మ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మాయి ఆ తర్వాత వరుస హిట్లతో జోరు చూపించింది. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ఊపు ఊపిన ఈ భామ తన రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసింది. వరుసగా నాని, రామ్ వంటి మిడ్ రేంజ్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావడంతో ఇక స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పుదామనుకుంది. కానీ ఆ తర్వాత వరుస బెట్టి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరైన బ్రేక్ ఇవ్వలేదు. అయినా తన వరకు పెర్ఫార్మన్స్ విషయంలో చేయాల్సింది చేసింది. కానీ ఎంత స్టార్ హీరోయిన్ కైనా టాలీవుడ్ లో వరుసగా నాలుగైదు ప్లాపులు పడ్డాయంటే, కెరీర్ డైలమా లో పడ్డట్టేగా.

KrithiShetty Upcoming movies update

వరుస ప్లాపుల తర్వాత ఒక్క డీసెంట్ హిట్..

అయితే తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈమె, మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. అయితే మరీ బ్యాడ్ మూవీస్ కాకపోయినా, సెలెక్టీవ్ గానే మంచి స్క్రిప్ట్ లు చేస్తున్నా, హిట్ అవడం లేదు. ఇక తన సినిమా కెరీర్ డైలమా లో పడ్డ సమయంలో మనమే (Manamey) సినిమాతో ఆడియన్స్ ని పలకరించింది కృతి శెట్టి (KrithiShetty). ఈ సినిమాతో డీసెంట్ హిట్ ని అందుకుంది. అయితే మరీ చెప్పుకునే రేంజ్ లో అయితే తన రోల్ లేదు. కానీ ట్రేడ్ లెక్కల్లో ఓ సక్సెస్ అయితే వచ్చింది. కానీ పెద్దగా ఆఫర్లు రావడం లేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఇప్పట్లో అవకాశాలు రావడం కష్టం, కానీ చిన్న హీరోల సినిమాల్లో ట్రై చేయొచ్చు. ఇదిలా ఉండగా తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోయేసరికి ఇతర భాషల్లో బాగానే ట్రై చేస్తుంది ఈ అమ్మడు.

- Advertisement -

ఒకేసారి రెండు భాషల్లో సినిమా!

ఇక కృతి శెట్టి ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తుండగా, చాలామందికి తెలియకుండానే వేరే భాషలో సినిమాలు చేసేసింది. మలయాళంలో టువినో థామస్ (Tivino Thamous) నటించిన ARM రిలీజ్ కి రెడీ అవుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతి. అలాగే తమిళ్ లో రెండు సినిమాలు చేయగా, కార్తీ (Kaarthi) తో ‘వా వాథియర్’ అనే సినిమా చేయగా, ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే జీని (Geenie) అనే మరో సినిమాలో నటించగా ఈ రెండు సినిమాలు రిలీజ్ సిద్ధం అవుతున్నాయి. ఇక మలయాళం సినిమా ARM ఈ వారం సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది. మరి తెలుగులో స్టార్ డమ్ కోల్పోయిన ఈ భామ ఇతర ఇండస్ట్రీలలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు