టాలీవుడ్ లో ప్రస్తుతం దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ప్రేక్షకులకు, అభిమానులకు మరింత దగ్గర అయ్యేందుకు కృతి శెట్టి సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ మతిపోగోడుతోంది. ఈ మధ్యకాలంలో కృతి శెట్టి గ్లామర్ పరంగాను కాస్త ఓ మెట్టు ఎక్కింది. అందాల విందులో అధరహో అనిపిస్తుంది. ఇటీవల ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంది.
అయితే, తొలి చిత్రం ‘ఉప్పెన’ తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి మాలివుడ్ కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళం లో ‘అజయాంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతి శెట్టి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కూడా కథానాయికలుగా కనిపిస్తారు. “మూడు యుగాల కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టోవినో థామస్ మూడు పాత్రల్లో కనిపిస్తారు. మనీయన్, అజయన్, కుంజికే పాత్రలు పోషిస్తున్నారు ఆయన. కథ రీత్యా కేరళ లోని కలరి మార్షల్ ఆర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దీంతో కలరి విద్యలో టోవినో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం జరిగింది” అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Read More: Rangabali: మళ్ళీ నోరు జారిన నాగ శౌర్య -కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా..?
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...