Krishnam Raju.. దివంగత నటులు కృష్ణంరాజు (Krishnam Raju) మనమధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఆయనకు నటన అంటే ఎంత ఇష్టం అంటే.. జీవితం చివరి దశకు చేరుకున్న సమయంలో కూడా నటించి, తన అభిరుచిని చాటుకున్నారు. ఇదిలా ఉండగా ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పని చేసిన ఈయన.. ఒకే ఒక్క హీరోయిన్ తో మాత్రం ఏకంగా 70కి పైగా చిత్రాలు చేశారు. మరి ఆమె ఎవరు..? ఎన్ని సినిమాలు ఎలా చేయగలిగారు? వీరిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పేరులోనే కాదు సహాయం చేయడంలో కూడా రాజే..
కృష్ణంరాజు.. పేరులోనే కాదు ఇతరులకు సహాయం చేయడంలో కూడా రాజే. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ఒక రాజులా వెలుగు వెలిగారు. హీరో గానే కాకుండా విలక్షణ నటుడిగా కూడా నటించి విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాంగ్రీ మెన్ పాత్రలతో పాటు తిరుగుబాటు చేసే పాత్రలతో కూడా మెప్పించిన రెబెల్ స్టార్ 5 దశాబ్దాల కెరియర్ లో సుమారు 200 కు పైగా చిత్రాలలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో పాటు యాక్షన్ సినిమాలతో కూడా అలరించారు. ముఖ్యంగా చాలామంది హీరోయిన్లతో కలిసి పనిచేసిన ఈయన దాదాపు అందరూ హీరోయిన్లతో కూడా మంచి కెమిస్ట్రీ పండించి ఆకట్టుకున్నారు.
జయసుధ అంటే ఇష్టం.. అందుకే 70 సినిమాలలో నటించా..
అందుకే కృష్ణంరాజు సినిమా అంటే ఎవరైనా సరే ఆసక్తి చూపిస్తారు. ఇక వెండితెరపై కృష్ణంరాజుతో జోడి అంటే ఎక్కువగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు ప్రథమంగా వినిపిస్తాయి. వారిలో ప్రధమంగా వినిపించే పేరు జయసుధ (Jayasudha). ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కి ఫేవరెట్ హీరోయిన్ కూడా ఆమె.. మరొకవైపు తనతో జోడి కట్టే విషయంలో కూడా ఈయనకు జయసుధ అంటే చాలా ఇష్టమట. ఆమె అంటే అంతగా నచ్చడానికి గల కారణాన్ని కూడా కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర హీరోయిన్ లు నాతో నటించేటప్పుడు బ్యాలెన్స్ తప్పుతారు. కానీ జయసుధతో అలా కాదు ఇంటిమేట్ సీన్ , డ్యూయెట్ సాంగ్స్, భార్యాభర్తల పాత్రలు ఇలా ఏవైనా సరే మేమిద్దరం ఒక అండర్ స్టాండింగ్ కి వైఎస్, ఆ పాత్రలు చేసుకుంటాము. అలా మా ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే ఆ పాత్రలు అంత బాగా పండాయి. అందుకే ఆమెతో నేను 70కి పైగా సినిమాలు చేశాను అంటూ తెలిపారు కృష్ణంరాజు.
తర్వాత స్థానం శ్రీదేవి కే..
ఇకపోతే ఐదు దశాబ్దాల కాలంలో 200 చిత్రాలు చేస్తే అందులో 70కి పైగా చిత్రాలు జయసుధ తో చేయడం విశేషం. ఇన్ని సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు అంటే ఇక వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గ్లామర్ విషయంలో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అని అడగా.. ఆయన శ్రీదేవి(Sridevi )పేరు చెప్పారు. ఆమె అందం తనకు నచ్చుతుందని , తామిద్దరం కలిసి ఒక 8 చిత్రాలు చేశామని తెలిపారు. డాన్సులు , కమర్షియల్ హీరోయిన్ అనే యాంగిల్ లో మాత్రమే ఆమెతో సినిమాలు చేశానని తెలిపారు కృష్ణంరాజు. ఇకపోతే ఇంత గొప్ప నటుడు మన మధ్య లేకపోయినా ఆయన వారసుడు ప్రభాస్ మాత్రం నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు.