Kota Srinivas Rao.. ఇండియన్ సినీ హిస్టరీలో పాన్ ఇండియా చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు, తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన చిత్రం బాహుబలి (Bahubali). ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు రూ.1000కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి పేరు అంతటా పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగిందనే చెప్పాలి. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్, రానా మల్టీస్టారర్ గా నటించారు. అంతేకాదు తమన్నా, రమ్యకృష్ణ , అనుష్క, సత్యరాజ్, నాజర్, అజయ్, అడివి శేషు, రోహిణి వంటి భారీతారాగణం ఇందులో నటించడం జరిగింది. అయితే ఇలాంటి ఒక గొప్ప సినిమాను, ఇది గొప్ప సినిమా ఏం కాదు అంటూ ప్రముఖ సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు ( Kota Srinivas Rao) చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వయసు పైబడడంతో సినిమాలకు దూరం..
అసలు విషయంలోకెళితే.. ఒకప్పుడు స్టార్ విలన్ గా భారీ పాపులర్ కి దక్కించుకున్నారు కోటా శ్రీనివాసరావు. విలన్ గానే కాకుండా కమెడియన్ గా కూడా నటించారు. ముఖ్యంగా బాబు మోహన్ , కోటా శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్ అంటే అభిమానులలో ఊహించని క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వస్తున్న ఈయన వయసు మీద పడడంతో సినిమాలలో నటించడం లేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో నటించాల్సి వస్తే వీల్ చైర్ లోనే నటిస్తున్నారు కోటా శ్రీనివాసరావు. ప్రస్తుతం ఈయన ఖాళీగా ఉన్న నేపథ్యంలో పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ఈయన చేసే కామెంట్లు విమర్శలకు కూడా దారితీస్తున్న విషయం తెలిసిందే.
పాతాళభైరవి ముందు బాహుబలి గొప్పేం కాదు..
ఇక ఇంటర్వ్యూలో భాగంగా తాజాగా బాహుబలి పై అలాంటి కామెంట్లు చేశారు కోట శ్రీనివాసరావు. ఈయన మాట్లాడుతూ.. బాహుబలి సినిమా విడుదలైనప్పుడు అందరూ సినిమాను తెగ పొగిడేశారు .అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. అయితే నేడు ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా.? కానీ అప్పుడెప్పుడో వచ్చిన పాతాళభైరవి సినిమా గురించి ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంతటి స్థాయిలో సినిమాలు నేటితరం దర్శకులు తీయలేరు. ఒకరకంగా చెప్పాలంటే పాతాళభైరవి సినిమా ముందు బాహుబలి సినిమా గొప్ప ఏం కాదు అంటూ సంచలన కామెంట్లు చేశారు కోట శ్రీనివాసరావు.
అభిమానులు ఫైర్..
అలాగే నేటితరం హీరోల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న నటులలో ఎన్టీఆర్ లాంటి నటుడు మరొకరు లేరు. ఆయన డాన్స్, నటన, డైలాగ్స్ అన్నీ కూడా పీక్స్ లో ఉంటాయి అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల కురిపించారు. అయితే ఇప్పుడు ఈయనపై నెటిజన్లు రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. కోటా శ్రీనివాసరావు ఇక్కడ కూడా తన సామాజిక వర్గాన్ని చూపిస్తున్నాడని, పాతాళభైరవి ముమ్మాటికి ఆల్ టైం రికార్డ్ అందులో ఎలాంటి సందేహం లేదు కానీ బాహుబలి సినిమాని తక్కువ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా.. బాహుబలి సినిమా వల్లే తెలుగు సినిమా ఖ్యాతి పాన్ ఇండియా లెవెల్ లో పాకిపోయింది. అది ఆయన గుర్తుంచుకోవాలి అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కోట శ్రీనివాసరావు లేదో చూడాలి.