Kiraak RP: అల్లు అర్జున్ పై శృతి మించి మాట్లాడుతున్న కిరాక్ ఆర్పీ.. ఈసారి ఏకంగా..?

Kiraak RP.. జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్ పి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ మొదలుపెట్టి.. పలు ప్రాంతాలలో తన ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఈసారి ఎన్నికలలో పోటీ చేశారో.. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ అభిమానిగా కామెంట్లు చేస్తూ.. జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉండే వారిపై రకరకాల కామెంట్లు చేస్తూ విరుచుకుపడుతున్నారు.. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి బదులుగా తన భార్య స్నేహితురాలి భర్త నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు పలకడమే కాదు స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించడంతో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఎందుకు మీ మామ పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకలేదో చెప్పాలి అని గట్టిగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

Kiraak RP: Kiraak RP talking out of tune on Allu Arjun.. this time together..?
Kiraak RP: Kiraak RP talking out of tune on Allu Arjun.. this time together..?

బన్నీ సినిమాలలో నటించే ప్రసక్తే లేదు..

అయితే ఇప్పుడు మరొకసారి అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా.. అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న ఒకటి ఎదురయింది.. దీనికి కిరాక్ ఆర్పి స్పందిస్తూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.. అల్లు అర్జున్ సినిమాలలో తాను నటించను అని ప్రకటించారు.. తనకు నటించాల్సిన అవసరం లేదు అని.. ఈ మేరకు హోటల్ తోనే పోల్చాడు.. ఉదాహరణకు చెబుతూ.. తినడానికి మెస్ కి వెళ్తాము.. అక్కడ సాంబార్, చట్నీ బాగాలేదు.. దీంతో హోటల్ యజమానికి మంచి కోసం బాగో లేవని చెబుతాం.. అలాగని నా హోటల్ కి రావద్దని చెబుతాడా? అలా చెబితే నాకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేసుకొని తింటా.. లేదంటే వేరే హోటల్ కి వెళ్తా.. బయట ఎన్ని లేవు? అల్లు అర్జున్ విషయంలో కూడా అంతే.. ఆయన సినిమాలు కాకపోతే వేరేవి.. చాలామంది ఆర్టిస్టులు , టెక్నీషియన్లు ఉన్నారు.. చాలా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి.. చిత్తూర్ నాగయ్య నుంచి చిరంజీవి దాకా ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తోంది.. అలాగే నిర్మాతలు, కెమెరామెన్లు, డైరెక్టర్లు, అసిస్టెంట్లు ఇలా సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్ లు ఉంటాయి.. ఒకటి కాకపోతే ఇంకొకటి.. ఎవరూ ఎవరినీ అణిచివేయలేరు ..ఎవరూ ఎవరినీ తొక్కేయలేరు అంటూ ఘాటుగా స్పందించాడు కిర్రాక్ ఆర్ పి .

జీవితాంతం కట్టుబడి వుంటా..

అంతేకాదు అల్లు అర్జున్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. జీవితాంతం ఇదే మాట మీద ఉండాలని స్పష్టం చేశాడు కిర్రాక్ ఆర్పీ.. ప్రశ్నిద్దాం అని రాజకీయాల్లోకి వచ్చాను.. ప్రశ్నిస్తూనే ఉంటాను అంటూ కామెంట్లు చేశారు. ఏది ఏమైనా కిర్రాక్ ఆర్ పీ అల్లు అర్జున్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు అల్లు అభిమానులు ఇతడి పై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అల్లు అర్జున్ సినిమాలు..

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప 2 సినిమా రాబోతోంది.. ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా.. షూటింగ్ వాయిదా పడ్డ నేపథ్యంలో డిసెంబర్ 6 కు సినిమాను వాయిదా వేశారు.. ఇక ఇందులో హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్నారు.. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా.. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు