Kiara Advani : కియారా వల్ల భర్త ప్రాణాలకు ప్రమాదం… సినీ ఫక్కీలో అభిమానిని 50 లక్షలు ముంచేసిన కేటుగాళ్లు

Kiara Advani : మూవీ లవర్స్ అలర్ట్ గా, సినిమా ఇండస్ట్రీ గురించి అవగాహన కలిగి ఉండాలి. లేదంటే అమాయకులను సినిమా లేదా స్టార్స్ పేరుతో నిండా ముంచెయ్యడానికి కేటుగాళ్లు కాచుకుని కూర్చుంటారు. మాయా మాటలు చెప్పి నిండా ముంచేస్తారు. తాజాగా ఇలాగే కియారా వల్ల ఆమె భర్త ప్రాణాలకు ముప్పు ఉందని మూవీ స్టైల్ లో స్టోరీ చెప్పి ఓ అభిమానిని బురిడీ కొట్టించారు ఫేక్ గాళ్ళు. ఏకంగా 50 లక్షలు ఇచ్చి నిండా మునిగిన ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నారు.

50 లక్షలు పోగొట్టుకున్న అమెరికా అభిమాని

అమెరికాలో ఉంటున్న మీను వాసుదేవ అనే సిద్ధార్థ్ మల్హోత్రా అభిమాని తాను ఎలా మోసపోయాడో తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్థ్ ఫ్యాన్ పేజీ తనను రూ.50 లక్షలు మోసం చేసిందని ఆరోపించారు. సిద్ధార్థ్, అతని భార్య కియారా అద్వానీ పేరిట ఈ మోసం జరిగినట్టు తెలుస్తోంది. నటుడు సిద్ధార్థ్ కూడా ఈ ఫ్యాన్ పేజీని ఫాలో అవుతున్నాడని మీను వాసుదేవ అనే అభిమాని పేర్కొన్నాడు. అమెరికాలో ఉంటున్న మీను.. ఫ్యాన్ పేజీలో నటుడి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారని, ఆ తర్వాత అలీజా, హుస్నా పర్వీన్ అనే ఇద్దరు వ్యక్తులు తనను లక్షలలో మోసం చేశారని చెప్పారు.

దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కూడా చాలా పోస్ట్‌లు చేశారు. సిద్ధార్థ్ ఫ్యాన్ పేజీకి అలీజా, హుస్నా పర్వీన్ అడ్మినిస్ట్రేటర్లు అని మీను వాసుదేవ తెలిపారు. సిద్ధార్థ్ ను చంపేస్తానని బెదిరించి, తనను పెళ్లి చేసుకోమని కియారా అతని కుటుంబాన్ని బలవంతం చేసిందని వారిద్దరూ ఈ ఫ్యాన్ కు చెప్పారట. సిద్ధార్థ్‌పై కియారా బ్లాక్ మ్యాజిక్ చేసిందని, అలాగే సిద్ధార్థ్ బ్యాంకు ఖాతాలన్ని కియారా హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయని సదరు అభిమానితో కథలు అల్లారట.

- Advertisement -

Sidharth Malhotra Fan Duped Of Rs 50 Lakh By Actor Fan Page SCAMMED Into Believing Actor Life Was In Danger कियारा आडवाणी ने सिद्धार्थ मल्होत्रा पर किया काला जादू, शादी करने के

హీరోను కాపాడాలని హెల్ప్ అడిగారు..

‘సిద్ధార్థ్‌ను రక్షించేందుకు సహాయం చేయమని అలీజా నన్ను కోరింది’ అని మీనూ చెప్పింది. తర్వాత స్కామర్‌లు తనను దీపక్ దూబే, సిద్ధార్థ్ పీఆర్ టీమ్‌కు చెందినవాడినని చెప్పుకునే ఇతరులకు కనెక్ట్ చేశారని తెలుపుతూ, వాళ్లకు సంబంధించిన మరిన్ని  వివరాలను అందించారు. సిద్ధార్థ్‌తో మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పడంతో అతనికి వారానికోసారి డబ్బు ఇచ్చాను. నటుడికి సంబంధించిన సమాచారం కోసం, నా దగ్గర ప్రతి వారం డబ్బులు వసూలు చేశారు. నేను సిద్ధార్థ్‌తో మాట్లాడాను కూడా. అయితే నేను మాట్లాడిన వ్యక్తి సిద్ధార్థ్ కాదని, మరెవరో అని తరువాత నాకు అర్థమైంది అని మీనూ చెప్పుకొచ్చారు.

50 లక్షల మోసం

మీను వాసుదేవ్ తన ‘X’ ఖాతాలో ఈ స్కామ్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. అందులో ఆమె నటుడితో నకిలీ చాట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది సిద్ధార్థ్‌కు సంబంధించిన ఫేక్ స్టోరీలు, గిఫ్ట్ హ్యాంపర్‌ల గురించి ఉంది. ఈ విధంగా మొత్తం రూ.50 లక్షల మేర మోసం చేసినట్లు మీనూ పేర్కొంది. ఈ సీరియస్ ఇష్యూపై సిద్ధార్థ్ మాట్లాడాలని మీనూ మరో పోస్ట్ లో రాసింది. అంతే కాకుండా వీలైతే పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని, ఒకవేళ వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే న్యాయపరంగా శిక్షిస్తానని సదరు ఫ్యాన్ డిమాండ్ చేశారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు