KBC 16.. భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) .. తన అద్భుతమైన నటనతో పర్ఫామెన్స్ తో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయనను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు నటుడిగా, మరొకవైపు పలు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న ఈయన మరోవైపు “కౌన్ బనేగా కరోడ్ పతి “వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ అటు హోస్ట్ గా కూడా సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్ హిందీలో చాలా జోరుగా ప్రసారమవుతోంది. ఈ షోని కోట్లాదిమంది ప్రజలు తిలకిస్తూ ఉంటారు.
కౌన్ బనేగా కరోడ్ పతి షో లో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న..
ఇలాంటి ఈ షోలో పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రశ్న అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఒక కంటెస్టెంట్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడిగారు హోస్ట్ అమితాబ్. 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు? అంటూ ప్రశ్నించగా కంటెస్టెంట్ ఇందుకోసం ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకున్నారు. ఇక షో కి హాజరైన దాదాపు 50 శాతం మంది ఆడియన్స్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు చెప్పడంతో వారు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి లాక్ చేశారు. ఇక ఇది సరైన సమాధానం కావడంతో ఆ కంటెస్టెంట్ రూ.1.60 లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్ళిపోయారు. అనంతరం అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ఈయన ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి కి చిన్న తమ్ముడు కూడా అంటూ ఆ కంటెస్టెంట్ కు తెలియజేశారు.
పవన్ ఫ్యాన్స్ ఖుషీ..
మొత్తానికైతే దేశం మొత్తం పాపులారిటీ సంపాదించుకున్న ఇలాంటి ఒక షోలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోకి సంబంధించి బాలీవుడ్ ప్రముఖ షో లో ప్రశ్న రావడం పై సంతోషం వ్యక్తం చేస్తూ షో ని మరింత పాపులర్ చేస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయాలంటూ వేగంగా దూసుకుపోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈయన ఓజీ , హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఓ జి సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం..
పవన్ కళ్యాణ్ రాజకీయ జీవిత విషయానికి వస్తే, సినిమాలతో భారీ క్రేజ్ అందుకున్న ఈయన ఇప్పుడు రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి రికార్డు సృష్టించారు. జనసేన పార్టీ తరఫున మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు , రెండు ఎంపీలు భారీ విజయాన్ని సొంతం చేసుకొని, 100% స్ట్రైక్ తో సక్సెస్ అందుకున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా సేవలందిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు బాలీవుడ్ షో లో కూడా పవన్ ప్రస్తావన రావడంతో ఆయన క్రేజ్ కాస్త ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరిగిపోయింది.
అమితాబ్ బచ్చన్ గారి అభిమాని గా మొదలైన @PawanKalyan గారి ప్రస్థానం
ఈరోజు అమితాబ్ బచ్చన్ గారు నిర్వహిస్తున్న అతి పెద్ద షో లో @SrBachchan గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్న అడిగే వరకు వచ్చింది ❤️🙏 pic.twitter.com/XJG60wAxzN
— Pawan Kalyan Crew (@PSPKCrew) September 14, 2024