Karthi29 : కోలీవుడ్ స్టార్ కార్తీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోగా అభిమానులను సంపాదించుకున్న కార్తీ (Karthi) తన విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని అభిమానులని సంపాదించాడు. ఇక లాస్ట్ ఇయర్ జపాన్ సినిమాతో ప్లాప్ అందుకున్నా, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక ప్రస్తుతం కార్తీ ’96’ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో “సత్యం సుందరం” (Sathyam sundaram) సినిమాలో నటించగా, ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగా కార్తీ ఈ సినిమా తర్వాత కూడా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. సర్దార్2, ఖైదీ2 తో పాటు, తాజాగా మరో సినిమాను కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేసాడు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కార్తీ29 ప్రాజెక్ట్..
ఇదిలా ఉండగా కార్తీ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కార్తీ నటించబోయే తన 29వ సినిమా గురించి అనౌన్స్ చేసారు మేకర్స్. కార్తీ తో ఖాకి, ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ “డ్రీమ్ వారియర్ పిక్చర్స్” (Dream Warrior Pictures) కార్తీ 29వ (Karthi29) సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ రాగా, తాజాగా ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో SR ప్రకాష్‌బాబు మరియు SR ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా మరియు రాజా సుబ్రమణియన్ కూడా నిర్మాణంలో భాగం కానున్నారు. ఇక ఈ సినిమాను తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ “తమిజా” (Tamizha) డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండగా, రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో సముద్రంలో ఉన్న ఒక పెద్ద షిప్ ని చూపించడం జరిగింది. బహుశా బ్రిటిష్ కాలానికి సంబంధించిన కథ కూడా అయి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో కార్తీ29..
ఇక ఈ సినిమా 150 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ ప్రారంభించారని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి నటీనటుల వివరాలు అతిత్వరలోనే ప్రకటించబోతున్నట్టు సమాచారం. అయితే కార్తీ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను 2025 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికంటే ముందు కార్తీ నటించిన సర్దార్2 (Sardar2) విడుదల కానుందని తెలుస్తుంది. ఇక ఈ ఇయర్ సెప్టెంబర్ 28న కార్తీ నటించిన సత్యం సుందరం విడుదలకు రెడీ అవుతుంది.