Kangana Ranaut : సినిమాలపై అలాంటి కామెంట్స్ చేసిన కొత్త మంత్రి..!

Kangana Ranaut : ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రస్తుతం రాజకీయాలలో కీలకమైపోయిన విషయం తెలిసిందే.. మొన్న జరిగిన లోకసభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ మండీ నుండి ఎంపీ పదవికి పోటీ చేసిన ఈమె మంత్రి అయిపోయింది.. భారీ మెజారిటీతో గెలుపొందింది. హీరోయిన్ కాస్త లోకసభ ఎంపీగా మారిపోయిన విషయం తెలిసిందే.. పైగా మొదటిసారి ఎలక్షన్స్ లో నిలబడి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులు, ప్రజలు కంగనా రనౌత్ ను ప్రత్యక్ష రాజకీయాలలో చూడాలని కోరుకున్నట్లు తెలుస్తోంది..

రాజకీయ ఆఫర్పై కంగనా కామెంట్స్..

Kangana Ranaut: The new minister who made such comments on movies..!
Kangana Ranaut: The new minister who made such comments on movies..!

ఇదిలా ఉండగా తాజాగా.. మీడియాతో మాట్లాడిన ఈమె రాజకీయాలలోకి రావాలని నన్ను సంప్రదించడం ఇదేమి మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చాయి.. గ్యాంగ్స్టర్ తర్వాత నాకు టికెట్ ఆఫర్ వచ్చింది.. మీ ముత్తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు.. కాబట్టి మీరు అలాంటి కుటుంబానికి చెందినవారు.. కొంత విజయాన్ని రుచి చూస్తే.. స్థానిక నాయకులు మీ వద్దకు వస్తారు.. అంటూ కొంతమంది నాకు టికెట్ ఆఫర్ చేశారు… ఇది చాలా సాధారణం.. నిజానికి మా నాన్నకి ఆఫర్ వచ్చింది.. నా సోదరి ఆసిడ్ దాడి నుండి బయటపడిన తర్వాత కూడా రాజకీయాల్లోకి రావాలని ఆఫర్ వచ్చింది.. కాబట్టి మాకు రాజకీయ ఆఫర్లు రావడం పెద్ద విషయమేమీ కాదు అంటూ చెప్పుకొచ్చింది కంగనా రనౌత్..

ఆఫర్లు రావడం కొత్తేమీ కాదు..

ఇకపోతే రాజకీయ నాయకుడి జీవితాన్ని కఠినమైనది అని పిలిచిన ఈమె… నేను అభిరుచిని అనుసరించే వ్యక్తిని.. సినిమా ఇండస్ట్రీలో నన్ను చూస్తే నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ,నిర్మాతగా మాత్రమే చూస్తారు.. కానీ రాజకీయ జీవితంలో ఇక్కడి ప్రజలతో మమేకం కావాల్సి వస్తే.. అందులోనే నేను ముందుకు వెళ్తాను.. అయితే రాజకీయాల్లో కంటే సినిమా పరిశ్రమలో పనిచేయడం చాలా సులభం.. నిజానికి రాజకీయాలు చాలా కఠినమైనవి.. ఆరోగ్యం బాగుండాలి అంటే వైద్యులు ఎంత అవసరమో.. సమస్యాత్మకమైన వ్యక్తులు మన దగ్గరికి వచ్చినప్పుడు వారి సమస్యలను తీర్చడం కూడా అంతే అవసరం.. నిజానికి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మనం చాలా రిలాక్స్ గా ఉంటాము ..కానీ రాజకీయాలు అలా కాదు ..

- Advertisement -

సినిమా కంటే రాజకీయం చాలా కష్టం..

ఈ కొత్త అవకాశాన్ని తాను ఎలా ఉపయోగించుకుంటాను అనే విషయంపై కూడా మాట్లాడుతూ.. 2019లో కూడా నన్ను సంప్రదించారు.. కానీ నేను ఆసక్తి చూపలేదు.. నేను నిజంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.. దానిని కేవలం ఒక విరామంగా చూడడం లేదు.. రాజకీయం చాలా కష్టమైన ప్రదేశం.. నేను సిద్ధంగా ఉన్నాను.. దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు.. కాబట్టి తప్పకుండా నేను తీసుకున్న రోల్ కి నిజాయితీతో పని చేస్తాను.. అవినీతిపరుల నుంచి కాపాడే వ్యక్తిని కావాలని మండీ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు.. దాని కోసమే వారు నన్ను ఎంచుకున్నారు.. వారిని నిరాశపరచడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ తెలిపింది కంగనా రనౌత్ తెలిపింది..

కంగనా సినిమాలు..

చివరిసారిగా వైమానిక యాక్షన్ మూవీ తేజస్ లో కనిపించింది . ఈమె స్వయంగా దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ తో సహా ఆమె ఖాతాలో మరో రెండు పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.. ఇందులో అనుపమ్ కేర్, శ్రేయాస్ తల్పాడే , మహిమా చౌదరి, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు.. ఇక ప్రస్తుతం రాజకీయాలలోనే బిజీ కావాలని కోరుకుంటున్న ఈమె సినిమాలకు దూరం అవుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు