Kangana Ranaut.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రణౌత్ (Kangana Ranaut)ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా తన ప్రతిభ కనబరుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె బాలీవుడ్ సినీ పరిశ్రమపై చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అంతేకాదు గతంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు ఎన్నటికీ లభించదు అంటూ అసహనంతో పాటు ఆవేదన వ్యక్తం చేసింది ఫైర్ బ్రాండ్.
కొత్త టాలెంట్ ను బాలీవుడ్ లో తొక్కేస్తారు..
ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వారిని ఎవరు ప్రోత్సహించరని, నిజాలు మాట్లాడే వారిని ఇండస్ట్రీ నుంచి గెంటేయాలని చూస్తారని , ముఖ్యంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈర్ష్య ఎక్కువగా ఉందని అసలు నిజాన్ని బయటపెట్టింది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికలలో నేను ఎంపీగా గెలవడం కొంతమందికి మింగుడు పడట్లేదు అంటూ తెలిపింది.
ప్రతిభావంతులు.. వారి కంట్లో పడితే కెరియర్ నాశనం..
ఇంటర్వ్యూలో భాగంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నిజానికి నేను ఒక మంచి మనిషిని. అందరితో కూడా మర్యాదగా నడుచు కుంటాను. కానీ కొంతమందికి మాత్రమే నేను సమస్యగా కనిపిస్తున్నాను. మరి ఆ సమస్య నాలో ఉందా .. లేక వారిలోనే ఉందా అనేది ఆలోచించుకోవాలి. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక నిస్సహాయ ప్రదేశం. టాలెంట్ ని చూసి అసూయ పడుతుంది. ప్రతిభావంతులు తమ కంట్లో పడితే కెరియర్ నాశనం అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉండే కొంతమంది ఇతరుల ప్రతిభను గుర్తించకపోగా.. వారు ఎదుగుతున్నారు అని తెలిస్తే మాత్రం వారిని కిందికి లాగే ప్రయత్నం చేస్తారు. దారుణంగా విష ప్రచారం చేస్తారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయే స్థితికి తీసుకొస్తారు. ఇక్కడ నెపోటిజం ఎక్కువ అంటూ విరుచుకుపడింది.
ప్రియాంక చోప్రా కి కూడా తప్పని తిప్పలు..
ఇకపోతే గతంలో కూడా ప్రియాంక చోప్రా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. తనకు బాలీవుడ్ సినీ పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేశారని, తనను చాలామంది విమర్శించారని, తనకు అవకాశాలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా తనపై అసత్య ప్రచారాలు చేశారు అంటూ వాపోయింది. అయితే ఇప్పుడు ఆమె హాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా చలామణి అవడమే కాదు వందల కోట్ల ప్రాపర్టీలు కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కంగనా రనౌత్ కూడా బాలీవుడ్ పరిశ్రమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇలాంటి ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
కంగనా రనౌత్ సినిమాలు..
కంగనా రనౌత్ సినిమాల విషయానికొస్తే , ఈమె స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. మరి ఇప్పుడైనా విడుదలవుతుందా? ఒకవేళ విడుదలయితే సక్సెస్ అవుతుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంటుంది.