Kalki2898AD : కల్కి లో తన లుక్ గురించి తొలిసారి ప్రస్తావించిన కమల్ హాసన్..

Kalki2898AD : టాలీవుడ్ తో పాటు ఇండియన్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజి మూవీ కల్కి2898AD సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు పీక్స్ కి వెళ్తున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ సహా ఇప్పటివరకు రిలీజ్ చేసిన అన్ని ప్రమోషనల్ వీడియోలు సినిమాపై అంచనాలు ఎన్నో రెట్లు పెంచేసాయి. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా, వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లు తాజాగా ముంబైలో మొదలు పెట్టగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్, దీపికా పదుకొనె సహా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ హల్క్ దగ్గుపాటి రానా హోస్ట్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర నటీనటులు సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే లెజెండరి నటులు కమల్ హసన్ ఈ సినిమాలో తన లుక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Kamal Haasan's interesting comments about his look in Kalki2898AD

కల్కి లో తన లుక్ గురించి కమల్ మాటల్లో…

ఇక కమల్ హాసన్ కల్కి2898AD చిత్రంలో తన ప్రత్యేకమైన లుక్ గురించి మాట్లాడాడు… కమల్ హాసన్ మాట్లాడుతూ… ‘కల్కి 2898 AD’ కోసం తన లుక్‌ ని పర్ఫెక్ట్ చేయడానికి మూవీ టీమ్ లాస్ ఏంజెల్స్‌ కు అనేక పర్యటనలు చేసిందని కమల్ హాసన్ వెల్లడించారు. తన కొత్త రూపాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ తన గురువు బాలచందర్ స్ఫూర్తితో అసాధారణమైన విజయాలను సాధించే సాధారణ పాత్రలను పోషించడంలో తన సౌలభ్యం గురించి కూడా మాట్లాడాడు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి అని, అయితే కాన్సెప్ట్‌ లను ఎఫెక్టివ్‌గా ప్రదర్శించడంలో నాగ్ అశ్విన్ సామర్థ్యాన్ని హైలైట్ చేసే గొప్ప ఆలోచనలు ఉన్నాయని కొనియాడారు.
“నాగ్ అశ్విన్‌ని చూసి నేను ఆశ్చర్యపోలేదు. నేను మామూలుగా కనిపించే వ్యక్తులను తక్కువ అంచనా వేయను. మీరు వారితో నిమగ్నమైనప్పుడు వారు లోతుగా ఉంటారు.. నాగికి దానిని ఎలా చేయాలో తెలుసని ” కమల్ హాసన్ అన్నారు. అలాంటి పాత్రలు ఆసక్తికరమైన విషయాలు మరియు ఆనందాన్ని పొందుతాయి, కాబట్టి తాను ‘చెడ్డ వ్యక్తి’గా నటించాలనే కోరికను కూడా పేర్కొన్నాడు.

- Advertisement -

కల్కి లో సరికొత్త అవతార్ లో కమల్…

ఇక కల్కి2898AD ట్రైలర్ వచ్చినపుడే కమల్ హాసన్ పాత్ర లుక్ రివీల్ అయింది. అది కూడా ట్రైలర్ చివర్లో కమల్ ఎంట్రీ ఇస్తే… ఒక్క షాట్ లోనే కనిపించినా తన అప్పీరెన్స్ తో సినిమాపై హైప్ ని ఎన్నో రెట్లు పెంచారు. ఇక ఈ ట్రైలర్ లో కమల్ హాసన్ నుదుటిపై మెరుస్తున్న గాటుతో కనిపించారు. ఇక ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ తన పాత్రను చెడు ఆలోచనతో ఉన్న ఋషి పాత్రగా ఉండబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ప్రధాన తారాగణంతో పాటు రాజేంద్ర ప్రసాద్, పశుపతి, చెంబన్ వినోద్ జోస్, శోభన, బ్రహ్మానందం మరియు ఇతర నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక జూన్ 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న కల్కి2898AD సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు