Kalki2898AD : కల్కి దూకుడు… అమెరికాలో ఆల్ టైం రికార్డుకు అరడుగు దూరం

Kalki2898AD : టాలీవుడ్ తో సహా పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూడేళ్ల పాటు తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో పిచ్చెక్కించే హైప్ ని సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇతర భాషల్లో కల్కి ని ప్రమోట్ చేయట్లేదని ఫ్యాన్స్ నిరాశ పడగా, తాజాగా హిందీలోనే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వయంగా దగ్గుపాటి రానా దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఈ ప్రీ రీలాస్ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు లెజెండరీ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు రాగా, దీపికా పదుకునె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ సినిమా కోసం ప్రమోషన్స్ కి రావడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రస్తావించడం జరిగింది. ఇక కల్కి కోసం తెలుగుతో పాటు ముఖ్యంగా హిందీలో కల్కి కోసం మూవీ లవర్స్ ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాకి ఉన్న హైప్ కి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ పక్కాగా చెప్తున్నారు. ఇక ఈ రికార్డులు ఓవర్సీస్ నుండే మొదల పెట్టనున్నట్టు లెక్కలు చెప్తున్నాయి.

Kalki2898AD is setting all time records with premieres in overseas

ఆల్ టైం రికార్డుకు అరడుగు దూరంలో…

ఇక ఈ మధ్యకాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా సినిమాకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న కల్కి2898AD ఓవర్సీస్ లో అల్ టైం రికార్డులపై కన్నేసినట్టు తెలుస్తుంది. మామూలుగా ఓవర్సీస్ లో రాజమౌళి సినిమాలకి మాత్రమే 3 మిలియన్స్ డాలర్స్ కి పైగా ప్రీమియర్ షోల మార్కెట్ ఉంది. హీరోల పరంగా చూసుకుంటే ఆ స్థాయిలో మార్కెట్ ఉన్న ఒకే ఒక్క నటుడు డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు కల్కి2898AD లో అల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ నటించిన “కల్కి2898ఏడీ” మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుని RRR ప్రీమియర్స్ రికార్డ్ బ్రేక్ చేయాలనీ చూస్తుంది. కల్కి2898AD (Kalki2898AD) సినిమాకి సంబందించి ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక కల్కి సినిమా రిలీజ్ టైం వచ్చేసరికి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల బుకింగ్స్ ద్వారానే 3 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేస్తుంది కల్కి.

- Advertisement -

ఓవర్సీస్ సహా అన్ని చోట్ల రికార్డులు…

ఇక ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని మొదటి రోజు కల్కి2898ఏడీ అల్ టైం రికార్డ్స్ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దాదాపు ప్రీమియర్స్ తో కలిపి కల్కి ఫస్ట్ డే 5 మిలియన్ల డాలర్లకి పైగా వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటివరకు కల్కి మూవీ నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ ఇప్పుడు 3425 షోల నుండి $1.72M డాలర్ల మార్క్ బుకింగ్స్ దాటింది. కాగా మొత్తం ప్రీ-సేల్స్ దాదాపు $2.1M కి పైగా ఉంది. ఇక ప్రీమియర్ షోల సంఖ్యలో ఆల్ టైమ్ 2వ స్థానంలో ఉంది. మరియు USAలోని తెలుగు చిత్రాలలో ఆల్ టైమ్ 4వ అత్యధిక ప్రీమియర్ గ్రాసర్ గా కల్కి నిలిచింది. ఓవరాల్ గా RRR, బాహుబలి ది కంక్లూజన్ సినిమాల మధ్యలో అటు ఇటుగా కల్కి నిలిచింది. రిలీజ్ డేట్ వచ్చేసరికి ఈ సినిమాలని కూడా దాటేసి అల్ టైం రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఇప్పటివరకు తెలుగు బుకింగ్సే జరగగా, నిన్నటి నుండి మరిన్ని ఏరియాల్లో బుకింగ్స్ జోడించబడుతున్నాయి. కెనడాలోని సినీప్లెక్స్ లో హిందీ వెర్షన్ కోసం షోలను ప్రారంభించింది. ఇక ప్రీమియర్లకు ఇంకా 8 రోజుల సమయం ఉండగా, ఇప్పట్నుంచే రికార్డులు నమోదవుతుండటం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు