Kalki: రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ చూసినా కల్కి(Kalki) సినిమా గురించి టాపిక్ వినిపిస్తూ వస్తుంది. ఆ సినిమాను మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin). ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని చూపిస్తుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు.
ఇకపోతే దర్శకుడు నాగి అశ్విని ఇప్పటివరకు మూడు సినిమాలను తెరకెక్కించారు. తన రెండవ సినిమా మహానటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ప్రేక్షకులని ఆశ్చర్యపరిచి ప్రేక్షకులను థియేటర్ కు పరుగులు పెట్టేలా చేశారు. మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రను అద్భుతంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా మనసుకు హత్తుకునేలా తీశారు. అటువంటి దర్శకుడు నుంచి కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ సినిమా వచ్చింది అని అంటే అందరూ ఆశ్చర్యపోయారు కూడా, ఇకపోతే మహానటి సినిమాలో చాలామంది దర్శకులు వివిధ పాత్రలలో కనిపిస్తారు. కల్కి సినిమాలో కూడా కొంతమంది దర్శకులు కొన్ని పాత్రల్లో కనిపించారు.
అయితే ప్రతి సినిమాకి సంబంధించి కొంతమేరకు కొన్ని సీన్స్ ను లెన్త్ వలన కట్ చేసుకుంటూ వస్తారు. అలానే సినిమా కథకు అవసరంలేని సీన్స్ ను కూడా కొన్నిసార్లు తొలగించడం జరుగుతుంది. సినిమా హిట్ అయిన కొన్ని రోజుల తర్వాత ఆ సీన్స్ ను రిలీజ్ చేయడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు, అంటే సుందరానికి వంటి ఎన్నో సినిమాల సీన్స్ తర్వాత రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించిన కల్కి సినిమా డిలీటెడ్ సీన్స్ కూడా అప్లోడ్ చేసారు.
సగం సగం విఎఫ్ఎక్స్ డిలీట్ సీన్స్
ఇప్పుడు డిలీట్ చేసిన సీన్స్ లో అమితాబచ్చన్(Amitabh Bachchan) రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma), దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా కూడా పూర్తిస్థాయిలో వర్క్ చేయకుండా సగం సగం విఎఫ్ఎక్స్ తో ఈ సీన్స్ ను వదిలారు. ఈ సీన్స్ లో చాలాచోట్ల గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ కనిపిస్తూ వచ్చాయి. ఇక కల్కి సినిమా రీసెంట్ గానే బాక్స్ ఆఫీస్ వద్ద యాభై రోజులను పూర్తి చేసుకుంది. అలానే బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా పార్ట్ 2 పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను పూర్తి చేసిన తర్వాత మళ్లీ కల్కి సినిమా సీక్వెల్ పై ప్రభాస్ పని చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.