Kalki 2898 AD : సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం సీఎం జగన్ వార్నింగ్… టెన్షన్ లో కల్కి నిర్మాత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన అవినాభావ సంబంధం ఉంది. ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయటం మొదలుపెట్టింది. వీటన్నిటికీ కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో కీలకపాత్రను పోషించారు. అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమేరకు టికెట్ ధరలను తగ్గించి, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా థియేటర్ వద్ద కాపలాకు పంపించిన పరిస్థితి ఏర్పడింది. దీనివలన పవన్ కళ్యాణ్ సినిమాలు మంచి టాక్ సాధించుకున్న సరే కమర్షియల్ గా థియేటర్ వద్ద హిట్ కాలేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాకి యావరేజ్ టాక్ వస్తేనే కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అలాంటిది రెండు సినిమాలకి హిట్ టాక్ వచ్చిన కూడా అంతంత మాత్రమే ఉన్నాయి.

ప్రభుత్వం వద్దకు మెగాస్టార్ చిరంజీవి

లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దకు మెగాస్టార్ చిరంజీవి చాలామంది సినీ ప్రముఖులతో పాటు వెళ్లి కలిసి మాట్లాడి సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లను పెంచేలా ప్రయత్నం చేశారు. అయితే చిరంజీవి కలిసిన తర్వాత కూడా టికెట్లు రేట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చి పెంచడం జరిగింది. అందువలనే ట్రిపుల్ ఆర్ సినిమాకి అన్ని కోట్లు వచ్చే అవకాశం దక్కింది. హోల్ ప్రాసెస్ లో నాని సినిమాలు రెండు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచిన కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. దీనికి కారణం నాని చేసిన కొన్ని సంచలమైన వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. నాని ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక థియేటర్ కు వచ్చే డబ్బులు కంటే కూడా అక్కడ పాన్ షాప్ కి వచ్చే సేల్స్ ఎక్కువ ఉండటం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చాలామంది అధికార పార్టీ వాళ్లకి గుచ్చుకునేలా తగిలింది అప్పటినుంచి నాని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

Kalki 2898 Ad on June 27

- Advertisement -

టార్గెట్ కల్కి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న సినిమా కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను అశ్వని దత్ నిర్మిస్తున్నారు. అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అశ్విని దత్ కు మధ్య మంచి బాండింగ్ ఉంది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు. బహిరంగంగా చంద్రబాబు నాయుడు ను సపోర్ట్ చేస్తూ వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే పార్టీని బట్టి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వస్తే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్ లో ప్లాన్ చేస్తారు. ఒకవేళ రాకపోతే ఇదే ఫంక్షన్ను హైదరాబాద్లో చేయనున్నారు. అలానే ఒకవేళ ఇప్పుడున్న అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ సినిమాకి టికెట్ ప్రైజ్ తగ్గే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ సినిమాను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే ఈ సినిమా భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన కూడా కొంతమేరకు ఆధారపడి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు