Jyothi Rai: ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన నటి జ్యోతి రాయ్..!

Jyothi Rai.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తోంది. అలాగే తనకంటే చిన్నవాడైన దర్శకుడిని రెండో వివాహం చేసుకోవడంతో ఈమెపై నెటిజెన్లు పూర్తిస్థాయిలో మండిపడుతున్నారు.. ముఖ్యంగా నెట్టింట జ్యోతిరాయ్ గ్లామర్ ఫోటోస్ చూసి ఒక రేంజిలో ట్రోల్ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్ పైన ఆమె గట్టిగానే రియాక్ట్ అవుతూ పలు కామెంట్లు చేసింది జ్యోతిరాయ్.

ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..

Jyothi Rai: Actress Jyothi Rai who fell for trollers..!
Jyothi Rai: Actress Jyothi Rai who fell for trollers..!

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న జ్యోతి తన గురించి వచ్చిన ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ ఈ విధంగా కామెంట్లు చేసింది. జ్యోతిరాయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఉన్నది సినీ ప్రొఫెషన్ లోనే అని… అందుకు తగినట్లుగానే తనను తాను మార్చుకున్నట్లు కూడా తెలిపింది.. ముఖ్యంగా మోడ్రన్ పాత్రలు వస్తే వాటికి తగ్గట్టుగా.. ట్రెడిషనల్ పాత్రలు వస్తే అందుకు తగ్గట్టుగా తయారవుతానని కూడా స్పష్టం చేసింది.. అంతే కాదు తనను ట్రోల్స్ చేసేవారి మెంటాలిటీకి అది సంబంధించిందని.. వాళ్ళు ట్రోల్స్ చేస్తారని.. నేను ఫొటోస్ షేర్ చేయడం లేదు అంటూ కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

సాంప్రదాయంగా కనిపించిన జ్యోతి..

ప్రస్తుతం సోషల్ మీడియాలోనే అంతా నడుస్తోందని… కనుక నేను ఇలాగే ఉంటానంటే కుదరదు అని చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా ఇప్పటికీ గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలోనే తనను చూస్తున్నారని.. కానీ అంతకు ముందు ఒక షోలో దాదాపు 60 ఎపిసోడ్స్ మోడ్రన్ డ్రెస్ లో చేశానని కూడా తెలిపింది. ఇకపోతే గుప్పెడంత మనసు సినిమాలో ఈమె కట్టు బొట్టుతో సాంప్రదాయంగా అందరినీ అలరించింది.. నాచురల్ యాక్టింగ్ తో జగతి మేడం పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి అదే పేరుతో చలామణి అవుతుంది. అయితే సీరియల్స్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపించే జ్యోతిరాయ్ బయట మాత్రం చాలా డిఫరెంట్ నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తోంది.

- Advertisement -

జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్..

ఇకపోతే సీరియల్స్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపించే జ్యోతి బయట మాత్రం చాలా డిఫరెంట్ గా గ్లామర్ లుక్ లో కనిపించేసరికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె పై ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో.. ఇక తాను పాత్రకు తగ్గట్టుగా మారిపోవాల్సి ఉంటుందని.. అప్పుడే తనను ప్రేక్షకులు ఆదరిస్తారని.. తన వేలో చెప్పుకొచ్చింది జ్యోతి.. ప్రస్తుతం జ్యోతి రాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఏది ఏమైనా క్యారెక్టర్ కి తగ్గట్టుగా ఎవరైనా సరే మారిపోవాలి..
లేకపోతే ఆ పాత్రకు వారు న్యాయం చేయలేరు.. ఇక ఒక పాత్రలో బాగా చేసిందని..మరొక పాత్రలో పాత్రకు తగ్గట్టుగా మారిపోతే ఇలా ట్రోల్స్ చేయడం సబబుకాదని తోటి నటీనటులు కూడా జ్యోతి రాయ్ కి అండగా నిలుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు