Devara : అనిరుధ్ మ్యూజిక్ పై ఎన్టీఆర్ పొగడ్తలు.. అసలు దేవరకి అనిరుధ్ న్యాయం చేశాడా?

Devara : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న “దేవర” ఎట్టకేలకు సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” కోసం నందమూరి అభిమానులతో పాటు, మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేవర నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక దేవర ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచే, సినిమాపై మరింత అంచనాలను పెంచడానికి చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeepreddy vanga) తో కూడా చిత్ర యూనిట్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసారు. అయితే ఈ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.

Junior NTR compliments on Anirudh's music for Devara

అనిరుద్ పై ఎన్టీఆర్ ప్రశంసలు…

ఇక దేవర (Devara) సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనిరుధ్ పై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇంటర్వ్యూ లో ప్రశంసల వర్షం కురిపించాడు. అనిరుద్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ… దేవర సినిమాను అనిరుధ్ బాగా అర్థం చేసుకున్నాడు. దేవర కోసం అతను సృష్టించిన మ్యూజిక్ ఇంటర్నేషనల్ సినిమాల రేంజ్ లో ఉంది. ప్రేక్షకులు అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా తక్కువ కాదు. ఆడియన్స్ ఎంత కోరుకుంటారో అంతకన్నా ఎక్కువే ఇచ్చాడు. ఎదో ఒకరోజు అనిరుద్ హాలీవుడ్ ఇంటర్నేషనల్ మూవీస్ లో భాగమవుతాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ అన్న ఈ మాటలు చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

దేవరకు అనిరుధ్ న్యాయం చేశాడా?

అయితే ఎన్టీఆర్ మ్యూజిక్ పై అనిరుధ్ (Anirudh) పై చేసిన వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంగానే ఉన్నా, చాలా వరకు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు విమర్శకులైతే అనిరుధ్ నిజంగా దేవరకు ఎన్టీఆర్ పొగిడిన స్థాయిలో మ్యూజిక్ అందించాడా అన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఒక్క దేవర టీజర్ మినహా, విడుదలైన మూడు పాటలకు మ్యూజిక్ పరంగా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పైగా మూడు పాటలు కూడా కాపీ ట్యూన్స్ లగే ఉన్నాయని, ఫ్రెష్ ట్యూన్స్ అయితే కావని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు. ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు కూడా ఓవరాల్ గా బీజీఎమ్ బాగానే ఉన్నా, అభిమానులు ఆశించిన రేంజ్ లో లేదన్న మాట వాస్తవం. మరి ఎన్టీఆర్ అన్నట్టు సినిమాలో మంచి మ్యూజిక్ ఏమైనా అనిరుద్ దాచి ఉంచడా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ఇప్పటివరకు దేవర విషయంలో అంతంత మాత్రంగానే మెప్పించిన అనిరుధ్, దేవరకు పూర్తి న్యాయం చేశాడా లేదా తెలియాలంటే దేవర రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు