Jr.NTR.. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన తల్లి షాలిని (Shalini)కోరిక తీర్చినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR )తన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi pranati) తల్లి షాలినితో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించుకున్నారు. దీనిపై ఆయన ట్వీట్ కూడా చేశారు. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి, శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలనే మా అమ్మ కోరిక నెరవేరింది. అమ్మ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) కు నేను ఇచ్చే బహుమతి ఇదే. ఇందుకు సహకరించిన నిర్మాత విజయ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , హీరో రిషబ్ కు నా ధన్యవాదాలు అంటూ ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు..
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR )ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను దక్కించుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి కాంబినేషన్లో రాంచరణ్ (Ram Charan)తో కలిసి నటించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఎన్టీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు మాత్రమే కాదు అంతకుమించి అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు తన ప్రతి సినిమా విషయంలో కూడా జాగ్రత్త వహిస్తున్న ఎన్టీఆర్ అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా , రెండవ భాగానికి ఇంకాస్త ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా..
దేవర సినిమా పూర్తి అయిన వెంటనే కేజిఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయిఅందరూ చెబుతున్నట్లుగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారని సమాచారం.
దేవర మూవీ విశేషాలు..
మరి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత దేవర రెండవ భాగాన్ని కూడా పూర్తి చేస్తారు ఎన్టీఆర్ . మరి ఈ దేవర చిత్రాలతో ఎన్టీఆర్ ఏవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. ఇక ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉండగా , బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ ఒకవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే, మరొకవైపు తన తల్లి కోరికలు కూడా తీరుస్తూ గొప్ప కొడుకుగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక తమ అభిమాన హీరో పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ మరొకసారి ఆయనను ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
My mother’s forever dream of bringing me to her hometown Kundapura and seeking darshan at Udupi Sri Krishna Matha has finally come true! To make it happen just before her birthday on September 2nd is the best gift I could give her.
Thanks to @VKiragandur sir and my dearest… pic.twitter.com/sj3rtExmnp
— Jr NTR (@tarak9999) August 31, 2024