Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” ట్రైలర్ ఎట్టకేలకు యూట్యూబ్ లో విడుదలై ట్రెండ్ అవుతుంది. కాసేపటికిందే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ నెట్టింట నిమిషాల వ్యవధిలోనే టాప్ లో ట్రెండ్ అవుతుంది. అయితే పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక తెలుగులో మాత్రం దేవరకి ఊహించని విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర (Devara) ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగిపోతాయనుకుంటే, ఉన్న హైప్ ని తగ్గించేసేలా ట్రైలర్ ఉందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. దీనికి తోడు ట్రైలర్ లాంచ్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ దేవరపై లేనిపోని అనుమానాలకి దారి తీస్తుంది.
ఆ 40 నిముషాలు తప్పా.. సినిమాలో ఏముండదా ఏంటి?
కాసేపటికిందే దేవర ట్రైలర్ రిలీజ్ అవగా, నెట్టింట ట్రెండ్ అవుతుండగా, ఈ ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేసారు చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అయితే ఆ వ్యాఖ్యలు సినిమాపై హైప్ ని పెంచుతున్నాయి. అలాగే పలు అనుమానాలకు తావునిస్తూ, హైప్ తగ్గించేలా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ లాంచ్ లో ఎన్టీఆర్ (Jr NTR) మాట్లాడుతూ… దేవరలో చివరి 40 నిముషాలు అందరిని కట్టిపడేస్తుంది, ఆడియన్స్ ని విజువల్ గా కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు. ఆడియన్స్ తో దేవర చిత్రాన్ని చూసేందుకు తానింకా వెయిట్ చేయలేను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్ విన్న తర్వాత నెట్టింట సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
తేడా కొడితే?
అయితే దేవర ట్రైలర్ చూసాక చాలామంది అభిమానులు కూడా పూర్తిగా సంతృప్తితో లేరు. ట్రైలర్ చూస్తుంటే చాలామందికి కొడుకు పాత్ర చిరాకు వేసేలా ఉంటుందని తెలుస్తూనే ఉంది. అయితే సినిమాలో తండ్రి పాత్ర వచ్చేంతవరకు సినిమా స్లోగానే ఉంటుందని తెలిసిపోతుంది… బహుశా సెకండ్ హాఫ్ లోనే దేవర ఎంట్రీ ఉంటుందని, క్లైమాక్స్ 40 నిమిషల్లోనే తండ్రి పాత్ర వస్తుందని ఎన్టీఆర్ మాటల్ని బట్టి తెలుస్తుంది. దీంతో సెకండ్ పార్ట్ కోసమే అక్కడ ఓ పెద్ద ఓ ట్విస్ట్ రాసుకున్నారని, సినిమాకి అదే హైలెట్ గా రాసుకున్నారని తెలుస్తుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ చివరి 40 నిముషాలు తప్ప సినిమాలో ఇంకేమి ఉండదా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ తో దేవరపై ఉన్న హైప్ కూడా పోయేలా ఉందని అంటున్నారు. అయితే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. ఆలోపు మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.