JR NTR – RamCharan : టాలీవుడ్ లో నందమూరి – మెగాభిమానుల మధ్య ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయని తెలిసిందే. ముందు జెనరేషన్స్ లో చిరంజీవి – బాలకృష్ణ ఫ్యాన్స్ వార్ జరిగితే, ఇప్పుడు అదే వార్ ని ఇప్పటితరం హీరోల అభిమానులు కంటిన్యూ చేస్తున్నారు. నందమూరి, మెగా వారసులైన జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ (JR NTR – RamCharan) లు ఎంత సన్నిహితంగా ఉంటారో తెలిసిందే. RRR తో పాన్ ఇండియా స్టార్లయినా ఆఫ్ లైన్ లో ఎన్నోయేళ్ళ నుండి వీళ్ళ మధ్య మైత్రి ఉంది. ఎన్నో ఈవెంట్స్ లో వీళ్ళు సందడి చేస్తుంటారు. RRR సినిమాతో నందమూరి, మెగాభిమానులు కూడా ఎంతో కలిసిపోతారని చాలామంది అనుకున్నారు. కానీ అభిమానుల మధ్య వార్ మరింత పెరిగిపోయింది. అయితే వీళ్ళ సినిమాలు వచ్చి రెండేళ్ల పైగానే అవగా, ఫ్యాన్స్ కూడా కాస్త చల్లబడ్డారు. అయితే నిన్నటి నుండి నెట్టింట మళ్ళీ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేసారు.
పోస్టర్లు పెట్టిన చిచ్చు…
అయితే నిన్న వినాయక చవితి కానుకగా, ఇరు హీరోల అభిమానులకు మాకెర్స్ అప్డేట్ ఇస్తూ, అదిరిపోయే పోస్టర్లు వదిలారు. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ (GameChanger) నుండి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇస్తూ, పోస్టర్ రిలీజ్ చేయగా, ఎన్టీఆర్ దేవర (Devara) నుండి ట్రైలర్ అప్డేట్ పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్లు ఒకే రోజు రిలీజ్ కావడంతో మళ్ళీ తారక్ – చరణ్ ఫ్యాన్స్ నెట్టింట యుద్ధం మొదలెట్టారు. మా హీరో పోస్టర్ బాగుందంటే, మా హీరో పోస్టర్ అదిరిపోయిందని, మీ హీరో పోస్టర్ అలా ఉంది, ఇలా ఉందని.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముందుగా ఎన్టీఆర్ (Jr NTR) దేవర పోస్టర్ రిలీజ్ కాగా, అందులో “ఎన్టీఆర్స్ దేవర” అని పోస్టర్లో ఉంటే… రామ్ చరణ్ (Ram charan) గేమ్ ఛేంజర్ పోస్టర్ లో “శంకర్స్ గేమ్ చేంజర్” అని ఉంది. ఇక్కడే తేడా తెలుస్తుందని… దీన్ని అడ్డంగా పెట్టుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ పోస్టర్ ని ట్రోల్ చేస్తూ, ఎన్టీఆర్ కత్తి పట్టుకొని కనిపించినా మాస్ అప్పీల్ లేదని, కానీ చరణ్ ఫార్మల్ షర్ట్ వేసుకొని తలకి ఎర్రగుడ్డ చుట్టుకుంటే మాస్ అప్పీల్ వచ్చిందని చరణ్ ఫాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక కొందరు నెటిజన్లు ఎన్టీఆర్ పోస్టర్ ని ట్రోల్ చేస్తూ మటన్ కొట్టు మస్తాన్.. అని, రామ్ చరణ్ పోస్టర్ ని రైల్వే స్టేషన్ లో కూలీ లా ఉన్నాడని ట్రోల్ చేస్తున్నారు. ఇక వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినపుడు కూడా ఈ సోషల్ మీడియా వార్ ఆగేలా లేదనిపిస్తుంది.
మూడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు..
ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్లు మొదలుపెట్టగా, ఎన్టీఆర్ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తుండగా, రెండు సినిమాలకు మూడు నెలల సమయం ఉందని తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల సత్తా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.