Jr NTR: ప్రశాంత్ నీల్ తో తారక్…. కానీ అంతా సీక్రెట్ గానే….!

 

Jr NTR: ప్రశాంత్ నీల్ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా తనేంటో ప్రపంచానికి నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రశాంత్ నీల్ తన అద్భుతమైన దర్శకత్వం, హీరోయిజాన్ని చూపించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం వచ్చిన కేజిఎఫ్-2తో పాటు సలార్ సినిమాలు సైతం భారీ విజయాలను అందుకున్నాయి.

దీంతో ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమాలపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనే ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందన్న వార్త ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ 31వ చిత్రం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Crazy update from NTR Prashant Neel movie.. Shocking comments from fans

ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా…. అటు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తల ప్రకారం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఈనెల 9వ తేదీన అంటే రేపు ప్రారంభం కానుందట.

ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేస్తున్నారట. అంటే చాలా సీక్రెట్ గా రేపు జరిగే కార్యక్రమానికి మీడియా కవరేజీ లేదట. లాంచ్ వేడుక తర్వాత ప్రొడక్షన్ టీం నుంచి ఈ సినిమా ప్రారంభానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు