Johnny Master Case : నేషనల్ అవార్డు విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) పై హైదరాబాద్లో హత్యాచార కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. డాన్సర్ అయిన బాధితురాలు ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా అత్యాచారం చేశాడు అంటూ జానీ మాస్టర్ (Johnny Master)పై ఫిర్యాదు చేసింది. అయితే కొద్దిరోజుల క్రితమే పోలీసులకు ఈ ఫిర్యాదు అందగా, రాయదుర్గం పోలీసులు జీరో ఎఫైర్ నమోదు చేసి కేసును నార్సింగ్ పిఎస్ కు బదిలీ చేశారు. ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా తాజాగా ఈ వివాదానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ మీడియా చేతికి చిక్కింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ లో నమోదైన పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?
ఢీ అనే డాన్స్ రియాల్టీ షోతో కొరియోగ్రాఫర్ గా మారిన జానీ మాస్టర్ (Johnny Master) టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ అని చెప్పొచ్చు. ఆయన మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో సహా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి పలువురు స్టార్ హీరోల పాటలకు కొరియోగ్రఫీ అందించారు. తెలుగులోనే కాకుండా శాండిల్ వుడ్, బాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రంగస్థలం సినిమాలో జిగేలురాణి, అల వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ, పుష్ప మూవీలో శ్రీవల్లి వంటి సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాకుండా తెలుగు సినిమా టీవీ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై లైంగిక ఆరోపణలతో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఎఫ్ఐలో తెలిపిన వివరాలు ఏంటంటే…
ఢీ12 షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే 2019లో కాల్ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానని చెప్పిన జానీ మాస్టర్ (Johnny Master) ముంబైతో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ లో ఉన్నప్పుడు బాధితురాలిని లైంగికంగా వేధించాడు. అయితే అలాంటి టైంలో ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారనీ, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చారని ఆ ఎఫ్ఐఆర్ లో ఉంది. ఒకవేళ తను చెప్పినట్టుగా పెళ్లి చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించడంతోపాటు షూటింగ్ వానిటీ వాన్ లలో ఎన్నోసార్లు వేధించారని, అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేశారని ఆ బాధితురాలు ఎఫ్ఐఆర్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. అయితే మరోవైపు తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య పలుమార్లు కొట్టింది అంటూ జానీ మాస్టర్ (Johnny Master) భార్యను విషయాన్ని కూడా బయటపెట్టింది.
గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులు…
ఆగస్టు 17న ఒక గుర్తు తెలియని వ్యక్తి తనను బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. ఇక ఆగస్టు 28న తన ఇంటి దగ్గరకు వచ్చిన పార్సిల్ లో కంగ్రాచులేషన్స్ బట్ బి వెరీ కేర్ఫుల్ అనే అక్షరాలు రాసి ఉన్నాయనే అంశాలను పోలీసుల ముందు వెల్లడించింది ఆ యువతి. ఈ విషయాలన్నీ పోలీసులు నమోదు చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ రిపోర్టులో ఉన్నాయి.