Jayam Ravi : ప్రముఖ తమిళ నటుడు జయం రవి ఈరోజు అంటే సెప్టెంబర్ 9న తన పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు. పెళ్ళైన దశాబ్దం తరువాత తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నాను అని అఫీషియల్ గా వెల్లడించారు. ఎప్పటి నుంచో ఈ జంట విడిపోనుంది అనే రూమర్లు విన్పించాయి. ఎట్టకేలకు ఆ రూమర్లే నిజం అయ్యాయి. మరి ఒకరినొకరు ఎంతగానో ప్రేమించి, కొంతకాలం డేటింగ్ చేశాకే పెళ్లి చేసుకున్న ఈ సెలబ్రిటీ జంట ఎందుకు విడిపోతోంది? అసలు జయం రవి, ఆర్తిల లవ్ స్టోరీ ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
జయం రవి, ఆర్తిల లవ్ స్టోరీ
జయం రవి స్టార్ హీరో. ఆర్తి మాత్రం టీవీ నిర్మాత సుజాత విజయ కుమార్ కుమార్తె. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆమె సినిమాలపై ఆసక్తి చూపించలేదు. ఈ జంట స్కాట్లాండ్‌లో మొట్ట మొదటిసారి కలుసుకున్నారు. ఫస్ట్ ఎట్ సైట్ లాగా అప్పుడే ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత రవి, ఆర్తి 2009 జూన్ 4న స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ మాజీ జంట 2010లో మొదటిసారిగా తమ మొదటి సంతానం ఆరవ్‌ను స్వాగతిస్తూ తల్లిదండ్రులు అయ్యారు. 2014లో జయం రవి, ఆర్తి దంపతులకు అయాన్ అనే మరో కుమారుడు జన్మించాడు. అయితే పెళ్లయ్యేదాకా ఈ జంట తమ లవ్ స్టోరీని సీక్రెట్ గానే ఉంచారు. అయితే పెళ్ళైన టైంలో ప్రతి ఆడబిడ్డలాగే ఆర్తి తల్లిదండ్రులకు దూరం అవుతున్నాను అనే బాధతో ఏడ్చిందా? అనే ప్రశ్నకు గతంలో ఆమె ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో ఆర్తి మాట్లాడుతూ “ఇది స్పష్టంగా మా జీవితంలో ఒక ప్రత్యేక క్షణం. మేము ఆ రోజు కోసం చాలా టైం వెయిట్ చేశాము. మేము మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే పెళ్ళికి సిద్ధం అయ్యాము. కాబట్టి పెళ్ళిలో తాను ఏడవలేదని చెప్పింది. పైగా ఆ టైంలో తన భర్తతో తన భవిష్యత్తు గురించి చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది.
జయం రవి సీక్రెట్ రిలేషన్షిప్
అదే ఇంటర్వ్యూలో జయం రవి ఉద్దేశపూర్వకంగా తమ బంధాన్ని మీడియా, లైమ్‌లైట్ నుండి దూరంగా ఉంచామని వెల్లడించారు. జయం రవి మాట్లాడుతూ “నేను సెలబ్రిటీని కాబట్టి మా లవ్ స్టోరీలో చాలా యు-టర్న్ లు తీసుకున్నాము. ఎక్కడికైనా వెళితే వెంటనే ఫోటోలు తీసుకుంటారు. అలాగే ఆ సమయంలో మా తల్లిదండ్రులకు ఈ విషయం గురించి తెలియదు. కాబట్టి సీక్రెట్ గానే మా లవ్ స్టోరీ నడిచింది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమ బంధాన్ని దాచడానికి ప్రయత్నించడం వల్ల డేటింగ్ కాలం మొత్తం కారులోనే సాగిందని ఆర్తి తెలిపింది. ఇక అప్పట్లో ఈ జంట లవ్ స్టోరీ పీక్స్ లో నడిచింది. ఏకంగా జయం రవి తన ప్రియురాలిని కలుసుకోవడానికి ఇంట్లో నుంచి రాత్రిపూట సీక్రెట్ గా బయట పడేవారట.