Janvi Kapoor : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( Ntr ) త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా దేవర సినిమా పై ఎక్స్ఫకటేషన్స్ రోజు రోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janvikapoor ) తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై హైఫ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం భారీ అంచనాలను పెంచేస్తుంది. ఒక అద్భుతమైన ప్రపంచానికి డైరెక్టర్ కొరటాల శివ ( Koratala Siva ) తీసుకెళ్లాడు. ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జాన్వీ కపూర్ శారీలో మెరిసింది. ఆ శారీ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ శారీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ కొరటాల శివతో పాటు పలువురు పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్ లో జాన్వీ కపూర్ చీరలో మెరిసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ దానికి మ్యాచ్ అయ్యేలా పింక్ శారీలో ఆమె ప్రిన్సెస్ లా మెరిసిపోయింది. అయితే దేవర ప్రమోషనల్ ఈవెంట్ లో జాన్వీ కపూర్ కట్టిన గులాబీ రంగు చీర ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. నచికేత్ బ్రావే డిజైన్ ఆ పింక్ కలర్ చీర ఖరీదు అక్షరాల రూ. 1,24,850 వరకు ఉంటుందట.. ఇక దానికి సెట్ అయ్యేలా ఆమె పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర రూ. 13 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెళ్లబడుతున్నారు. కాగా, తెలుగులో జాన్వీ కపూర్ కు దేవరనే తొలి చిత్రం. ఈ మూవీ హిట్ అయితే ఇక పాప సుడి తిరిగినట్లే…
ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.. సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈనెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి త్వరలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి హృతిక్ రోషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం వార్2 చిత్రంలో హృతిక్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ స్నేహంతోనే హృతిక్ రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ లేదా చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తేకానీ ఒక స్పష్టత రాదు.. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే… ఇక జాన్వీ పాప దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకున్నట్లు ఒక్క సినిమా రిలీజ్ కాలేదు కానీ వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది.. తర్వాత రామ్ చరణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.. అటు బాలీవుడ్ లో కూడా హవాను కొనసాగిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే..