Terminator : హాలీవుడ్ దిగ్దర్శకుడు జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన టైటానిక్, అవతార్ వంటి సినిమాలు ప్రపంచ వ్యక్తంగా సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అలాగే ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో “టెర్మినేటర్” కూడా ఒకటి. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ప్రధాన పాత్రలో జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1984 లో విడుదలై ఘన విజయం సాధించింది. దీని తర్వాత టెర్మినేటర్2 : ది జడ్జిమెంట్ డే పేరుతో సీక్వెల్ తెరకెక్కి మరో బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సిరీస్ లో సినిమా రాలేదు. దీని తర్వాత టైటానిక్, అవతార్ సినిమాలే చేసాడు. అయితే ఇన్నాళ్లకు జేమ్స్ కామెరూన్ నుండి టెర్మినేటర్ సీక్వెల్ రానుందట.
టెర్మినేటర్ సీక్వెల్ ఫిక్స్..
తాజాగా టెర్మినేటర్ (Terminator) సీక్వెల్ కి సంబంధించి అప్డేట్ వచ్చింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘ది హాలీవుడ్’ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, అవతార్4 మరియు అవతార్5 లకు దర్శకత్వం వహించడంతో పాటు, టెర్మినేటర్ యూనివర్స్ లో కొత్త ప్రాజెక్ట్ లో తాను పనిచేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసారు. అవును.. త్వరలో టెర్మినేటర్ నుండి మూడో సీక్వెల్ రానుందని ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేసారు. అయితే ఈ సీక్వెల్ ని బహుశా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించకపోవచ్చు. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ, కథా సహకారం అందించవచ్చు. అయితే ఈ సినిమా అవతార్3 (Avatar) రిలీజ్ తర్వాతే మొదలుకానుందని సమాచారం.
అవతార్ 4,5 కూడా వస్తాయట..
ఇక జేమ్స్ కామెరూన్ (James Cameron) టెర్మినేటర్ గురించి మాత్రమే కాకుండా అవతార్ సీక్వెల్స్ పై కూడా అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే అవతార్ 3 సీక్వెల్ రిలీజ్ అప్డేట్ ఇవ్వగా, వీటి తర్వాత అవతార్4 మరియు, అవతార్5 లు కూడా ఉంటాయని చెప్పారు. అయితే వీటికి దర్శకత్వం వహిస్తారా లేదా అనేది ముందుముందు తెలుస్తుంది. ఆయన అయితే దాదాపుగా తానే చేస్తానని అన్నారు. ఇక “అవతార్ 3 ఫైర్ అండ్ యాష్” పేరుతో డిసెంబర్ 2025 లో విడుదల కానుంది. ఇక నాలుగు, మరియు ఐదవ పార్ట్స్ వరుసగా 2029 మరియు 2031లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.