J.D.Chakraborty.. బొంబాయి ప్రియుడు, గులాబీ, ప్రేమకు వేళాయరా వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న జే.డీ.చక్రవర్తి (JD.Chakraborty) ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టకు ముందు పలు చిత్రాలలో విలన్ గా నటించారు. అలాంటి చిత్రాలలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన శివ (Shiva )కూడా ఒకటి. నాగార్జున(Nagarjuna ) కెరియర్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ద్వారా విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు జే. డీ.చక్రవర్తి. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఆ తర్వాత హీరోగా కూడా మారి తనలోని గొప్ప టాలెంట్ ను నిరూపించారు.
మెగాస్టార్ దుర్మార్గుడు – జెడి చక్రవర్తి..
ఇక ఫేడౌట్ అవుతున్న సమయంలో మళ్లీ దయా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జె.డి చక్రవర్తి మరొకసారి తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను అలరించారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న జే.డీ. చక్రవర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ ఇంటర్వ్యూలో మెగాస్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi ) గురించి మాట్లాడుతూ.. చిరంజీవి ఒక పెద్ద రాక్షసుడు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఎందుకు చిరంజీవిని జెడి చక్రవర్తి ఇలా అన్నారు అనే విషయానికి వస్తే.. చిరంజీవి పెద్ద పని రాక్షసుడు అని, పని విషయంలో చాలా డెడికేటెడ్ గా వ్యవహరిస్తారని తెలిపారు.
పని రాక్షసుడు అంటూ కామెంట్స్..
అయితే ఘరానా మొగుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఆ పక్కనే సెట్లో జెడి చక్రవర్తి కూడా అంతం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారట. ఆ సమయంలో జెడి చక్రవర్తి చిరంజీవిని గమనిస్తూ ఉండేవారట. చాలామంది రెస్ట్ తీసుకొని, షిఫ్ట్ లు మారినా, చిరంజీవి మాత్రం అలాగే ఆయన పని ఆయన చేస్తూనే ఉండేవారు..అయితే ఒకరోజు అంబాసిడర్ కార్ లోని చిరంజీవి నిద్రపోవడం చూసి ఆగబెట్టుకోలేక ఎందుకండీ ఇలా పడుకున్నారు, రూమ్ కి వెళ్లి పడుకోవచ్చు కదా అని నేను అడిగాను.. దానికి చిరంజీవి నేనిక్కడ పడుకుంటే నన్ను లేపుతారు. కానీ రూమ్ లో పడుకుంటే ఎవరూ లేపరు. నావల్ల షూటింగ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఇక్కడే పడుకున్నాను అంటూ చెప్పారు చిరంజీవి.
నాడు కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్..
ఇక చిరంజీవి మాటలకు షాక్ అయిన నేను.. వామ్మో ఇంత పని రాక్షసుడా , ఈయన దుర్మార్గుడిలా ఉన్నాడే అంటూ లోలోపల అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాను అంటూ తెలిపారు జెడి చక్రవర్తి. మొత్తానికైతే జెడి చక్రవర్తి చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇకపోతే చిరంజీవి అంత కష్టపడ్డారు కాబట్టే నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. ఎటువంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్వయంకృషితో నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు అంటే నాడు ఆయన పడిన కష్టమే నేడు ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికి అయితే జీడి చక్రవర్తి చేసిన కామెంట్స్ లో ఏమాత్రం తప్పులేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.