India’s Best Dancer : డ్యాన్స్ ప్రియుల కోసమే ప్రత్యేకంగా కొన్ని షోలను పలు టీవీ ఛానల్స్ డిజైన్ చేస్తున్నాయి. కానీ వాటిలో అశ్లీలత ఎక్కువవుతోంది అంటూ కొంతకాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ డ్యాన్స్ షోకు సంబంధించిన హాట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో జడ్జ్ లతో పాటు అందరూ చూస్తుండగానే కంటెస్టెంట్స్ డ్యాన్స్ మరిచిపోయి రొమాన్స్ లో మునిగిపోయారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు వదిలితే స్టేజ్ పైనే శోభనం చేసుకునేలా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ షో ఏంటి? ఒళ్ళు మరిచి మరీ స్టేజ్ పైనే రొమాన్స్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరు? అనే విషయంలోకి వెళ్తే….
డ్యాన్స్ షో స్టేజ్ పై మితిమీరిన రొమాన్స్
ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ షోలో జరిగింది ఈ షాకింగ్ ఘటన. 2020లో సాగిన ఈ షోకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా ఖాన్ జడ్జిగా వ్యవహరించింది. ఇక ఆమె జడ్జి అంటే షో ఏ రేంజ్ లో ఉంటుందో ముందే ఊహించవచ్చు. కానీ కంటెస్టెంట్స్ మాత్రం ఈ షోలో ఊహించని రేంజ్ లో రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేశారు అనడం కన్నా రొమాన్స్ లో రెచ్చిపోయారు అనొచ్చు. సాధ్వి, హిమాన్షు అనే జంట ఒకానొక టైంలో చేసిన డ్యాన్స్ అయితే టీవీలు చూస్తున్న వారిని నోళ్లు వెళ్ళబెట్టేలా చేసింది. జడ్జిలు సైతం షాకై లేచి నిల్చున్నారు. యాంకర్ స్టేజ్ పైనే శోభనం చేసుకునేలా ఉన్నారే అంటూ వచ్చి వారిద్దరినీ వేరు చేయకపోతే అదే జరిగిదేమో అన్పిస్తోంది వీడియో చూస్తుంటే. కనీసం ఇంత చేసినా గెలిచారా అంటే అదీ లేదు. మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది ఈ జంట. అయితే ఇది తాజా సీజన్ కు సంబంధించిన వీడియో కానప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హాట్ కంటెంట్ తోనే నెట్టుకొస్తున్న షో
టెలివిజన్ కు టీఆర్పీ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ టీఆర్పీని రాబట్టుకోవడానికి మేకర్స్ ఎంతకు దిగజారడానికైనా వెనకాడట్లేదు. ముఖ్యంగా డ్యాన్స్ షోలలో డ్యాన్స్ పేరుతో అశ్లీలతే ఎక్కువగా కన్పిస్తోంది. సౌత్ లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ నార్త్ లో దీనికి అడ్డు అదుపూ లేకుండా సాగుతోంది. టీవీలకు కూడా సెన్సార్ పెట్టాలి అనేలా ఉంటున్నాయి పలు హిందీ డ్యాన్స్ షోలు. అయితే ఈ డ్యాన్స్ షోలను చూసి ఎంజాయ్ చేసే వారు చేస్తుంటే, మరికొంత మంది మాత్రం రోత పుట్టించేలా ఉంది అంటూ విసుక్కుంటున్నారు. ఇక ప్రస్తుతం ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 4 నడుస్తోంది. అందులో మొదటి రెండు సీజన్లకు మాత్రమే మలైకా జడ్జిగా వ్యవహరించింది. తాజా సీజన్ కు మాత్రం కరిష్మా కపూర్, గీతా కపూర్ జడ్జీలుగా చేస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి సాధ్వి, హిమాన్షు కలిసి చేసిన ఆ బో*ల్డ్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.